
iQOO Neo 10: స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ప్రీమియం పనితీరు, గేమింగ్ ఫీచర్లకు ప్రసిద్ధి చెందిన iQOO బ్రాండ్ భారత మార్కెట్లో తన హవా కొనసాగిస్తోంది. ఈ కంపెనీ నెక్స్ట్-జెన్ ఫీచర్లతో గేమింగ్, టెక్నాలజీ ప్రియులకు ప్రత్యేకంగా టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే ఇండియాలో iQOO నియో సిరీస్‌కు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన iQOO నియో 10R తర్వాత, ఇప్పుడు కంపెనీ కొత్తగా iQOO నియో 10 ఫోన్‌ను టీజ్ చేసింది. ఇక iQOO తాజాగా విడుదల చేసిన టీజర్‌లో.. ఈ ఫోన్‌ను ఆరెంజ్, వైట్ కలర్ కాంబినేషన్‌లో చూపించారు. దీనిలో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ కనిపిస్తోంది. అలాగే ఈ డివైస్‌లో డ్యుయల్ చిప్ సెటప్ ఉండనున్నట్లు సమాచారం. ఇందులో ప్రధానంగా స్నాప్ డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు Q1 ఇన్డిపెండెంట్ గ్రాఫిక్స్ చిప్ ఉండే అవకాశం ఉంది.
ఇంతకుముందు చైనాలో విడుదలైన iQOO Z10 టర్బో ప్రో డివైస్‌ను భారత మార్కెట్లో iQOO నియో 10గా రీలాంచ్ చేయనున్నట్లు సమాచారం. అందువల్ల ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 50MP సోనీ LYT-600 కెమెరా సెన్సార్ (OISతో), 8MP అల్ట్రా వైడ్ కెమెరా వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ IP65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇక ఇందులో 7000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీ కెమెరా విషయంలో చైనాలో వచ్చిన వేరియంట్ 16MP కెమెరాతో వచ్చినప్పటికీ, భారత్ లో 32MP ఫ్రంట్ కెమెరాతో రాబోవచ్చని అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ iQOO నియో 10 ఫోన్‌ను అమెజాన్, ఐకూ (iQOO) వెబ్‌సైట్‌లలో లభ్యమయ్యేలా కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ నెలలోనే ఈ ఫోన్ అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, లాంచ్ డేట్ వంటివి త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.