
Reels Malking: ప్రస్తుతం ప్రజలందరూ టెక్నాలజీ యుగంలో దూసుకెళ్తున్నారు. ఇకపోతే, ప్రస్తుతం చాలామంది ప్రజలు బయట ప్రజలతో కలిసి మాట్లాడుకోవడం కరువైంది. కొందరైతే సోషల్ మీడియానే జీవితం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనలో చాలామంది సోషల్ మీడియాలో ఎలాగైనా ఫేమస్ అవ్వాలని ఏవేవో విషయాలకు సంబంధించి బిడిఓ తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనితో బయట మార్కెట్ లో అందుకు తగ్గట్టు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక ప్రత్యేకమైన అవసరాన్ని గుర్తించి అందరికీ అందుబాటులోకి తెచ్చింది ఓ వినూత్న యాప్ ‘ఫ్లాషూట్’.
వీడియోల యుగంలో జీవిస్తున్న మనమంతా, చిన్నా పెద్దా వేడుకల్ని కెమెరాలో బంధించడం తప్పనిసరిగా భావిస్తున్నాం. అయినా చిన్న ఫంక్షన్ల కోసం పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్‌లను బుక్ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. అంతే కాదు, వీడియోలు తీయడమంటే కేవలం ఫంక్షన్లకే పరిమితం కాదండోయ్.. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌ల కోసం కంటెంట్ తయారు చేయాలనుకునే క్రియేటర్లు కూడా ప్రొఫెషనల్ సపోర్ట్ కోసం చూస్తున్నారు. అలాంటి వారందరికీ సులభ పరిష్కార మార్గంగా మారింది ఫ్లాషూట్ యాప్. ఇక ఈ యాప్ ప్రత్యేకతలు ఏమిటంటే..
ఫొటోగ్రఫీ మీద ఆసక్తి ఉన్నవారు, విద్యార్థులు, పార్ట్ టైం పనులు చేయాలనుకునేవారు ఈ యాప్‌లో రిజిస్టర్ అయ్యి వీడియోగ్రాఫర్లుగా పనిచేయొచ్చు. అవసరమైతే శిక్షణ కూడా ఇస్తారు. అంతేకాదు, స్మార్ట్‌ఫోన్ల ఆధారంగా టెక్నాలజీని ఉపయోగించి తక్కువ పెట్టుబడితో మెరుగైన సేవలు అందించగలుగుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, ముంబయి నగరాల్లో ఫ్లాషూట్ సేవలు ప్రస్తుతం లభ్యమవుతున్నాయి.