Leading News Portal in Telugu

Motorola Razr 60 Ultra Flip Phone to Launch Confirmed in India on May 13 with Snapdragon 8 Elite


Motorola Razr 60 ultra: ఇట్స్ కన్ఫామ్.. మే 13న భారత్‌లో విడుదకు సిద్ధమైన మోటరోలా రేజర్ 60 అల్ట్రా.!

Motorola Razr 60 ultra: మోటరోలా కంపెనీ తాజాగా ప్రకటించిన సమాచారం ప్రకారం.. రేజర్ 60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను మే 13న భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఈ మొబైల్ మోటరోలా నుండి రాబోతున్న అత్యంత శక్తివంతమైన ఫ్లిప్ ఫోన్‌గా పరిగణించబడుతోంది. అయితే, ఈ ఫోన్ కేవలం 16GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో అందుబాటులోకి రానుంది. ఇది మౌంటైన్‌ ట్రైల్‌, రియో రెడ్‌, స్కరబ్‌ కలర్‌ వేరియంట్స్‌తోపాటు వుడ్‌, వేగాన్‌ లెదర్‌, అల్కాంటారా ఫినిష్‌లో మూడు ప్రత్యేక రంగుల్లో లభ్యమవుతుంది.

ఇక ఈ మొబైల్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. Qualcomm Snapdragon 8 Elite 3nm చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది అత్యాధునిక ప్రాసెసింగ్ స్పీడ్ తో పని చేస్తుంది. అయితే ఈ మొబైల్ ను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఫ్లిప్ ఫోన్‌గా మోటరోలా చెబుతోంది. ఈ ఫోన్‌లో మోటో AI ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ మొబైల్ సంబంధించిన టీజర్ వీడియోలో రియో రెడ్, మౌంటెన్ ట్రయిల్ రంగుల డిజైన్‌లను మాత్రమే చూపించారు.

ఇక మొబైల్ లో 7-అంగుళాల ఫ్లెక్స్ వ్యూ 1.5K pOLED LTPO డిస్‌ప్లే, 1Hz-165Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, గరిష్ఠంగా 4,000 నిట్స్ బ్రైట్‌నెస్ లు లోపలి డిస్‌ప్లేలో అందించబడుతాయి. అలాగే 4 అంగుళాల క్విక్ వ్యూ pOLED LTPO డిస్‌ప్లే, 1Hz-165Hz రిఫ్రెష్ రేట్, గోరిల్లా గ్లాస్ సిరామిక్ ప్రొటెక్షన్, గరిష్ఠంగా 3,000 నిట్స్ బ్రైట్‌నెస్ లను బయటి డిస్‌ప్లేలో అందించనున్నారు.

ఇక కెమెరా వివరాలు చూస్తే ఇందులో.. 50MP ప్రధాన కెమెరా, f/1.8 అప్రెచర్‌తో, OIS సపోర్ట్ గా.. 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, f/2.0 అప్రెచర్ లతోపాటు, 50MP ఫ్రంట్ కెమెరా, f/2.0 అప్రెచర్ తో రానున్నాయి. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్, డ్యూయల్ SIM సపోర్ట్ (eSIM + నానో SIM), స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ ఆడియో, USB Type-C ఆడియో, వాటర్ రెసిస్టెంట్ (IP48) రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6E, Bluetooth 5.4, NFC లాంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.

ఇక ఈ మొబైల్ లో 4700mAh బ్యాటరీకి, 68W టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్, 30W వైర్లెస్ చార్జింగ్ అందించనున్నారు. ఈ ఫోన్‌ను అమెజాన్, మోటోరోలా సైట్స్ లో ఆన్లైన్ అమ్మకాలు.. అలాగే ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. విడుదల తేదీ దగ్గరగా మరిన్ని వివరాలు మోటరోలా వెల్లడించనుంది. ఇక ఈ ఫ్లిప్ ఫోన్ భారత్‌ మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర సుమారుగా లక్ష రూపాయల పైనే ఉండే అవకాశం ఉంది.