
HONOR 400 Series: హానర్ కంపెనీ తమ కొత్త HONOR 400 సిరీస్ స్మార్ట్ఫోన్లను మే 22న లండన్‌లో నిర్వహించనున్న గ్లోబల్ ఈవెంట్లో విడుదల చేయబోతోందని అధికారికంగా ప్రకటించింది. ఈ ఈవెంట్ బుధవారం సాయంత్రం 4 గంటలకు (భారతీయ సమయ ప్రకారం రాత్రి 8:30 గంటలకు) ప్రారంభమవుతుంది. కంపెనీ ఈ ఈవెంట్‌ను లైవ్ స్ట్రీమ్ చేయనుంది. ఈ HONOR 400 సిరీస్‌లో రెండు ఫోన్లు ఉంటాయి. అవే.. HONOR 400, HONOR 400 Pro మొబైల్స్. ఇందుకు సంబంధించి కంపెనీ టీజర్ విదుదల చేసింది. దీని ప్రకారం, ఈ ఫోన్లలో 200MP అల్ట్రా క్లీర్ AI కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. HONOR 400 మోడల్లో డ్యూయల్ రియర్ కెమెరాలు కనిపిస్తుండగా, Pro మోడల్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో టెలిఫోటో కెమెరా ఉండే అవకాశం ఉంది. డిజైన్ విషయానికొస్తే, సాధారణ మోడల్ ఫ్లాట్ డిజైన్‌లో ఉండగా.. ప్రో మోడల్లో కర్వ్డ్ డిజైన్ ఉంటుంది.
HONOR 400 స్పెసిఫికేషన్లు పరంగా చూస్తే.. HONOR 400 మోడల్లో 6.55 అంగుళాల FHD+ 120Hz ఫ్లాట్ AMOLED డిస్ప్లే, 5000 నిట్స్ పీక్స్ బ్రైట్నెస్, స్నాప్ డ్రాగన్ 7 Gen 3 చిప్సెట్, 200MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా, IP65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, 5300mAh బ్యాటరీ ఉంటుందని ఊహిస్తున్నారు. అలాగే, HONOR 400 Pro స్పెసిఫికేషన్లు చూస్తే ఇందులో.. HONOR 400 Pro మోడల్లో 6.7 అంగుళాల FHD+ 120Hz ఫ్లాట్ AMOLED డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, 200MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 5300mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లు ఉండే అవకాశం ఉండనున్నట్లు సమాచారం.
ఈ స్మార్ట్ఫోన్లలో గూగుల్ జెమిని (Google Gemini), సర్కిల్ టు సెర్చ్, AI సమ్మరీ, AI సూపర్ జూమ్, AI పోర్ట్రైట్ స్నాప్, AI ఎరేజర్ వంటి ఆధునిక AI ఫీచర్లు అందుబాటులో ఉంటాయని సమాచారం. ఇంగ్లాండ్‌లో ప్రీ-రెజిస్ట్రేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. లాంచ్ అనంతరం వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. HONOR 400 సిరీస్ త్వరలో మలేసియాలో కూడా విడుదల కావచ్చని కంపెనీ సూచిస్తోంది. అంతేకాక, HONOR భారత మార్కెట్లో కూడా ఐదు కొత్త ఉత్పత్తుల విడుదలకు అనుమతులు పొందిన నేపథ్యంలో, భారత్‌లో కూడా ఈ ఫోన్లు త్వరలో లాంచ్ అయ్యే అవకాశముంది.
Design that speaks.
Join us 22nd May to unpack our all-new HONOR 400, the elegant AI-enhanced device crafted to spark daily wonder.#HONOR400 #SparkDailyWonder pic.twitter.com/pDr4R3Bwoi
— HONOR (@Honorglobal) May 8, 2025