Leading News Portal in Telugu

Lava Announces Limited-Time Rs 5000 Discount on Agni 3 5G During Lava Days on Amazon


Lava Agni 3: లిమిటెడ్ ఆఫర్.. లావా అగ్ని 3 పై ఏకంగా రూ. 5000 వరకు తగ్గింపు.!

Lava Agni 3: లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ తన అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్‌పై పరిమిత కాలం కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ “లావా డేస్” పేరిట అమెజాన్ ఇండియాలో మాత్రమే అందుబాటులో ఉంచింది. ఇందులో భాగంగా లావా అగ్ని 3 అన్ని వేరియంట్లపై రూ. 5000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తున్నారు. దీని కొన్ని బ్యాంకుల ఆఫర్ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంచారు. ఈ తగ్గింపు HDFC, ICICI, Axis Bank క్రెడిట్ కార్డులు, క్రెడిట్ కార్డ్ EMI లకు వర్తిస్తుంది.

ఇక లావా అగ్ని 3 ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల 1.5K కర్వ్ స్క్రీన్ (120Hz refresh rate), అలాగే 1.74 అంగుళాల రియర్ ప్యానెల్ అనే రెండు AMOLED డిస్ప్లేలు ఉన్నాయి. అలాగే ఇందులో మీడియాటెక్ Dimensity 7300X చిప్‌సెట్‌తో ప్రాసెసర్ పనిచేస్తుంది. ఇక కెమెరా సెటప్ విషయానికి వస్తే ఇందులో 50MP సోనీ మెయిన్ కెమెరా (OISతో), 8MP టెలీఫోటో (3X జూమ్), 8MP అల్ట్రావైడ్, 16MP ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి.

లావా అగ్ని 3లో శక్తివంతమైన 5000mAh బ్యాటరీని అందించారు. దీనికి 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీనితో వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఆడియో అనుభూతిని మెరుగుపరిచే విధంగా, ఫోన్‌లో డాల్బీ అట్మాస్ సాంకేతికతతో స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. వినియోగదారుల అనుభవాన్ని వ్యక్తిగతీకరించేందుకు కస్టమైజబుల్ యాక్షన్ కీను అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14పై పనిచేస్తుంది. వీటికి మూడు ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్లు అందించబడతాయని కంపెనీ హామీ ఇచ్చింది. AGNI Mitra హోం సర్వీస్ ద్వారా వినియోగదారులకు సౌకర్యవంతమైన సేవలు అందిస్తారు. చివరగా, ఈ ఫోన్ Heather, Pristine Glass అనే రెండు ఆకర్షణీయమైన ఫినిష్‌లలో లభ్యమవుతుంది.

ఈ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ మే 10 నుండి మే 18, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ఇండియాలో లభ్యమయ్యే అన్ని Lava Agni 3 మోడళ్లకు ఇది వర్తించనుంది. మిడ్-రేంజ్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది మంచి అవకాశం.