Leading News Portal in Telugu

Realme GT 7T Teased Ahead of May 27 Global and India Launch with Dimensity 8400 SoC


Realme GT 7T: భారత్ లో లాంచ్‌కు సిద్ధమైన రియల్‌మీ GT 7T.. ఫస్ట్ లుక్ విడుదల.!

Realme GT 7T: రియల్‌మీ తన నూతన స్మార్ట్‌ఫోన్ సిరీస్ GT 7ను ఈ నెల 27వ తేదీన పారిస్‌లో నిర్వహించే ఈవెంట్‌లో గ్లోబల్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగా GT 7 Pro గ్లోబల్ మార్కెట్‌కి, అలాగే GT 7T మోడల్‌ను ఇండియన్ మార్కెట్‌కి తీసుకురానున్నారు. తాజాగా కంపెనీ రియల్‌మీ GT 7T ఫోన్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇమేజ్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ పసుపు రంగులో ఉండగా.. ఫ్రేమ్, వాల్యూమ్ బటన్స్ నలుపు రంగులో కనిపిస్తున్నాయి. అలాగే దీనికి ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంది.

ఇక డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది GT 7 మోడల్‌లో కనిపించిన ట్రిపుల్ కెమెరా సెటప్ కన్నా తక్కువ. కెమెరా డెకోలో రింగ్ LED ఫ్లాష్, హైపర్ ఇమేజ్+ లోగో కనిపిస్తోంది. ఇది కొత్త రంగులో వచ్చినా, దీని రూపకల్పన చైనా మార్కెట్‌లో గత నెల విడుదలైన GT 7 మోడల్‌తో పోలి ఉంటుంది. ఇక చిప్‌సెట్ పరంగా చూస్తే, Dimensity 8400 SoC ఈ ఫోన్‌లో ఉపయోగించారు. ఇది చైనా వేరియంట్‌లో ఉన్న Dimensity 9400+ కన్నా తక్కువ శక్తి వంతమైనది.

ఈ ఫోన్‌లో 8GB ర్యామ్ వేరియంట్ తోపాటు, అలాగే 12GB ర్యామ్ వేరియంట్ కూడా ఉండే అవకాశం ఉంది. లాంచ్ అనంతరం రియల్‌మీ GT 7T ఫోన్‌ను అమెజాన్, రియల్‌మీ వెబ్ సైట్స్ లో అందుబాటులో ఉంటుంది. అలాగే ఆఫ్లైన్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. GT 7 వంటి ప్రత్యేకతలతో ఇది కూడా మార్కెట్లో అందుబాటులోకి రానుంది.