Leading News Portal in Telugu

boAt Launches Storm Infinity Plus Smartwatch in India with 1.96 inches Display, Bluetooth Calling, and 30-Day Battery Life


boAt Storm Infinity Plus: కేవలం రూ.1,199కే 1.96 అంగుళాల డిస్‌ప్లే, 30 రోజుల బ్యాటరీ లైఫ్ తో బోట్ స్మార్ట్‌వాచ్ విడుదల..!

boAt Storm Infinity Plus: ప్రముఖ స్మార్ట్‌వేర్ బ్రాండ్ boAt తన నూతన స్మార్ట్‌వాచ్ Storm Infinity Plusను భారత్‌లో విడుదల చేసింది. ఇది రోజువారీ అవసరాలు, యాక్టివ్ లైఫ్‌స్టైల్‌ను దృష్టిలో ఉంచుకొని దిసీజ్ఞ్ చేయబడింది. ఇక దీనిలోని ఫీచర్లు ఇలా ఉన్నాయి.

డిజైన్, డిస్‌ప్లే:
ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.96-అంగుళాల HD డిస్‌ప్లే ఉంది. ఇది 480 నిట్స్ ప్రకాశంతో సన్‌లైట్‌లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. వాచ్‌లో వేక్ గెచర్, రొటేటింగ్ క్రౌన్ వంటి ఫీచర్లతో పాటు నైలాన్ స్ట్రాప్ కూడా ఉంది. యూజర్లు అనేక వాచ్ ఫేస్‌లను ఉపయోగించి తమ స్టైల్‌కి తగినట్లుగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

కాల్, కనెక్టివిటీ ఫీచర్లు:
బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో పాటు బిల్ట్-ఇన్ స్పీకర్, మైక్ ఉన్న ఈ వాచ్‌లో 10 వరకు ఫ్రీక్వెంట్ కాంటాక్ట్స్‌ను సేవ్ చేసుకోవచ్చు. డయల్ ప్యాడ్ కూడా అందుబాటులో ఉంది.

బ్యాటరీ లైఫ్:
ఈ వాచ్ 680mAh సామర్థ్యం గల బ్యాటరీతో వస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే సాధారణ వాడకానికి 30 రోజుల వరకు బ్యాకప్ ఇస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జ్‌తో 4 రోజుల వరకు వాడవచ్చు. పూర్తిగా ఛార్జ్ కావడానికి 60 నిమిషాల సమయం పడుతుంది.

హెల్త్, ఫిట్‌నెస్ ఫీచర్లు:
Storm Infinity Plus లో హార్ట్ రేట్, SpO2, స్లీప్ ట్రాకింగ్, మెన్స్ ట్రాకింగ్, స్ట్రెస్ మానిటరింగ్, గైడెడ్ బ్రీతింగ్ వంటి ఆరోగ్య ఫీచర్లు ఉన్నాయి. అలాగే 100కిపైగా స్పోర్ట్స్ మోడ్‌లు, స్టెప్స్, క్యాలొరీస్, దూరం లాంటి డేటాను ట్రాక్ చేస్తుంది. సెడెంటరీ అలర్ట్స్, హైడ్రేషన్ రిమైండర్స్ కూడా ఉన్నాయి.

వీటితోపాటు వాచ్‌లో SOS అలర్ట్స్, నోటిఫికేషన్లు, క్విక్ రిప్లైలు, ఫైండ్ మై డివైస్, వాయిస్ అసిస్టెంట్, అలారమ్స్, స్టాప్‌వాచ్, కాలెండర్, క్యాలిక్యులేటర్, టార్చ్, మీడియా కంట్రోల్స్, గేమ్స్, రియల్ టైమ్ వెదర్ అప్‌డేట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది IP68 రేటింగ్‌తో ధూళి, చెమట, నీటి నుండి రక్షణ లభిస్తుంది.

Storm Infinity Plus సిలికాన్ స్ట్రాప్ వేరియంట్ ధర రూ.1,199గా నిర్ణయించబడింది. ఇది ఆక్టివ్ బ్లాక్, చెర్రీ బ్లాసమ్, డీప్ బ్లూ, కూల్ గ్రెయ్ కలర్లలో లభ్యమవుతుంది. నైలాన్ స్ట్రాప్ వేరియంట్ స్పోర్ట్స్ బ్లాక్, స్పోర్ట్స్ వైట్ కలర్లలో వస్తోంది. దీని ధర రూ.1,399. ఇది boAt లైఫ్‌స్టైల్ వెబ్‌సైట్, ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌కు 1 సంవత్సరం వారంటీ లభిస్తుంది.