Leading News Portal in Telugu

iQOO Neo10 Pro+ with 2K Display, Snapdragon 8 Elite, iQOO Pad 5 Series, and More to Launch on May 20


iQOO Neo10 Pro+: 7000mAh బ్యాటరీ, 2K OLED డిస్‌ప్లేతో విడుదలకాబోతున్న iQOO నియో10 ప్రో+..!

iQOO Neo10 Pro+: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ iQOO తన నూతన ఫ్లాగ్‌షిప్ ఫోన్ iQOO Neo10 Pro+ ను మే 20న అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్‌తో పాటు iQOO ప్యాడ్ 5, ప్యాడ్ 5 Pro, iQOO వాచ్ 5, iQOO TWS Air3 లాంటి ఇతర గ్యాడ్జెట్లు కూడా అదే వేదికపై విడుదల కానున్నాయి. ఇక ఫ్లాగ్‌షిప్ ఫోన్ iQOO Neo10 Pro+ సాంబంధించిన కొన్ని వివరాలు లీకుల ద్వారా బయటికి వచ్చాయి.

Raed Also: Airtel Black: క్రేజీ ఆఫర్.. కేవలం రూ.399లకే IPTV, అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, కాలింగ్, 350+ టీవీ ఛానళ్ల ఎంటర్టైన్‌మెంట్..!

iQOO Neo10 Pro+ మొబైల్ కి BMW M Motorsport కస్టమైజ్డ్ వెర్షన్ కూడా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ నొబిలి ఇండస్ట్రీలో 2K ఫ్లాట్ స్క్రీన్, స్నాప్ డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ కలిగిన ఏకైక డివైస్‌గా నిలుస్తోంది. గేమింగ్ పనితీరును మెరుగుపరచేందుకు Q2 గేమింగ్ చిప్ ప్రత్యేకంగా అందించబడుతోంది. ఇక ఇందులో 2K 8T LTPO AMOLED డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 8 Elite SoC ప్రాసెసర్, 50MP OIS మైన్ కెమెరా (1/1.56″ సెన్సార్), 50MP అల్ట్రా వైడ్ కెమెరాలు, 7000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ చార్జింగ్ తో రాబోతుంది. 3D అల్ట్రాసోనిక్ కలిగిన ఫింగర్‌ప్రింట్ స్కానర్ సోనిక్ ఇందులో ఉంది. ఈ ఫోన్ అన్‌టుటు బెంచ్‌మార్క్‌లో 3.3 మిలియన్ పాయింట్స్ స్కోర్ చేసిందని సమాచారం. దీని ధర చైనా మార్కెట్‌లో సుమారు 3000 యువాన్స్ గా ఉండే అవకాశముంది. (సుమారు రూ.35,000).

ఇక iQOO Pad 5 అండ్ Pad 5 Pro ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో.. 13-inch 3.1K LCD డిస్‌ప్లే, Dimensity 9400+ చిప్, 66W ఫాస్ట్ చార్జింగ్ లు iQOO Pad 5 Pro లో అందించబడుతాయి. అలాగే 12.1-inch 2.8K LCD డిస్‌ప్లే, Dimensity 9300+ చిప్, 44W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ iQOO Pad 5 లో అందించబడుతాయి.

Raed Also: Operation Sindoor: మధ్యాహ్నం 3:30 గంటలకు త్రివిధ దళాల డైరెక్టర్ జనరల్స్ మీడియా సమావేశం

ఈ సిరీస్‌లో iQOO Watch 5, iQOO TWS Air3 లాంటి వేరబుల్స్, టీఎడబ్ల్యూఎస్ ఉత్పత్తులు కూడా విడుదల కానున్నాయి. మే 20న జరిగే ఈ లాంచ్ ఈవెంట్‌ ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజమైన టెక్ ట్రీట్ కానుంది. మరిన్ని అధికారిక వివరాలు రాబోయే రోజుల్లో వెలుగులోకి రానున్నాయి.