Motorola Razr 60 Ultra with 6.96 inches Foldable Display, Snapdragon 8 Elite Chipset Launched in India for Rs 99999
- ఆధికారికంగా Motorola razr 60 Ultra భారత మార్కెట్లో విడుదల.
- 6.96 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 4 అంగుళాల అవుటర్ డిస్ప్లే.
- 50MP మెయిన్ కెమెరా (OIS తో), 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా
- 4700mAh బ్యాటరీ, 68W TurboPower ఫాస్ట్ చార్జింగ్, 30W వైర్లెస్ చార్జింగ్
- ఆండ్రాయిడ్ 15, IP48 వాటర్ రెసిస్టెన్స్.
- పాన్టోన్ స్కారబ్, పాన్టోన్ రియో రెడ్, పాన్టోన్ మౌంటెన్ ట్రయిల్ రంగులలో
- ధర రూ. 99,999కాగా.. డిస్కౌంట్ ఆఫర్ ద్వారా దీన్ని రూ. 89,999కే పొందవచ్చు.

Motorola razr 60 Ultra: మోటరోలా తన తాజా ఫ్లాగ్షిప్ ఫ్లిప్ ఫోన్ Motorola razr 60 Ultra ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. అయితే, ఈ ఫోన్‌ను మే 21 నుండి విక్రయానికి అందుబాటులోకి తీసుకురానుంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు అధునాతన ఫీచర్లతో ఈ ఫోన్‌ను రూపొందించారు. మరి ఈ ఫ్లాగ్షిప్ ఫ్లిప్ ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్లపై ఒక లుక్ వేద్దామా..
భారీ డిస్ప్లే:
ఈ ఫోన్లో 6.96 అంగుళాల 1.5K LTPO pOLED ఫ్లెక్సిబుల్ ఇన్హెర్నల్ డిస్ప్లే (1224×2992 pixels) ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 1Hz నుండి 165Hz వరకు ఉండేలా డైనమిక్‌గా మార్చుకోవచ్చు. అలాగే, 4 అంగుళాల QuickView POLED అవుటర్ డిస్ప్లే (1272×1080 pixels) ను కూడా కలిగి ఉంది. రెండు డిస్ప్లేలు కూడా 4000 నిట్స్ వరకు బ్రైట్నెస్, డోల్బీ విజన్ సపోర్ట్‌ను అందిస్తాయి.
ప్రాసెసర్, కెమెరా సెటప్:
ఈ ఫోన్లో Snapdragon 8 Elite 3nm Mobile Platform ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ లో లభ్యం కానున్నాయి. ఇక ఈ మొబైల్ లో ఫోటోగ్రఫీ కోసం 50MP ప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్‌తో), 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాను అందించారు. దీనితో అద్భుతమైన ఫోటోలను, వీడియోలను తీసుకోవచ్చు.
మోటో AI ఫీచర్లు:
మోటరోలా ఈ ఫోన్లో ప్రత్యేకంగా Moto ai ఫీచర్లను అందించింది. Catch Me Up, Pay Attention, Remember This లాంటి AI టూల్స్ వినియోగదారుల అభిప్రాయాల ఆధారంగా అభివృద్ధి చేశారు. అలాగే, AI Key ద్వారా ఈ ఫీచర్లను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఫోన్‌ను స్టాండ్ మోడ్ లేదా టెంట్ మోడ్‌లో ఉంచినపుడు Look and Talk ఫీచర్ ద్వారా హ్యాండ్స్-ఫ్రీగా మోటో AIతో సంభాషించవచ్చు.
Illegal Affair: భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న భార్య.. చివరకు ఏమైందంటే.?
బ్యాటరీ, ఇతర ఫీచర్లు:
Motorola razr 60 Ultra ఫోన్లో 4700mAh బ్యాటరీ ఉంది. ఇది 68W టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్, 30W వైర్లెస్ చార్జింగ్ లకు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 పై పనిచేసే ఈ ఫోన్‌కి మూడు సంవత్సరాల OS అప్డేట్లు, నాలుగేళ్ల సెక్యూరిటీ అప్డేట్లు అందనున్నాయి. ఫోన్ IP48 వాటర్ రెసిస్టెన్స్, Wi-Fi 7, Bluetooth 5.4, 5G వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది.
ధర:
Motorola razr 60 Ultra మొబైల్ పాన్టోన్ స్కారబ్, పాన్టోన్ రియో రెడ్, పాన్టోన్ మౌంటెన్ ట్రయిల్ రంగులలో లభిస్తుంది. దీని ధర రూ. 99,999గా నిర్ణయించారు. కానీ, ప్రముఖ బ్యాంకులు అందిస్తున్న రూ. 10,000 తక్షణ డిస్కౌంట్ ఆఫర్ ద్వారా దీన్ని రూ. 89,999కే పొందవచ్చు. ఫోన్ అమెజాన్, మోటోరోలా, రిలయన్స్ డిజిటల్ సైట్స్ లో.. ఇతర రిటైల్ స్టోర్లలో మే 21 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్ల కింద రిలయన్స్ జియో ద్వారా రూ. 15,000 విలువైన బెనిఫిట్స్ ను కూడా అందుకోవచ్చు.