
Nubia Z70S Ultra: నుబియా తమ కొత్త ఫ్లాగ్‌షిప్ కెమెరా-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్ nubia Z70S అల్ట్రాని గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. గత నెల చైనాలో విడుదలైన తర్వాత, ఇప్పుడు అంతర్జాతీయ వినియోగదారుల కోసం ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఫోటోగ్రఫీ ప్రియులకు టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ ఫోన్ పలు శక్తివంతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్‌ను nubia అధికారిక వెబ్‌సైట్ ద్వారా మే 28, 2025 వరకు ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా రూపొందించిన Z70S Ultra Retro Kit కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది.
ఈ ఫోన్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది కెమెరా వ్యవస్థ. ఇందులో ఓమ్నివిజన్ లైట్ అండ్ షాడో మాస్టర్ 990 అనే కస్టమ్ 50MP సెన్సార్ ఉపయోగించబడింది. ఇది 35mm ఫోకల్ లెన్త్‌తో వస్తూ, H/V QPD ఆటోఫోకస్, DCG HDR టెక్నాలజీ వంటి అత్యాధునిక ఫీచర్లతో ఒక్క అంగుళ సెన్సార్ స్టాండర్డ్స్‌ను మించి ఫోటో క్వాలిటీ అందిస్తుంది. అలాగే ఇందులో 64MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (OIS సపోర్ట్‌తో), 50MP అల్ట్రా వైడ్ లెన్స్ (మ్యాక్రో మోడ్‌తో), ఫిజికల్ షట్టర్ బటన్ (హాఫ్ ప్రెస్‌తో ఫోకస్, లాంగ్ ప్రెస్‌తో షూట్) లను అందించనున్నారు. ఈ ఫోన్‌తో పాటు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీకి అనుకూలంగా Retro Kit కూడా అందించబడుతుంది. ఇందులో క్లాసిక్ ఫోన్ కేసు, Neo Bar కెమెరా కంట్రోల్ బార్, ఫిల్టర్ అడాప్టర్ రింగులు ఉన్నాయి.
nubia Z70S Ultra Photographer Edition ఫోన్ ఫోటోగ్రఫీ ప్రియులను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక కెమెరా సామర్థ్యాలతో డిజైన్ చేయబడింది. ఇందులో ఉన్న 64MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ OIS సపోర్ట్‌తో కలిపి దూర దృశ్యాలను కూడా అధిక స్పష్టతతో కాప్చర్ చేయగలదు. అలాగే 50MP అల్ట్రా వైడ్ లెన్స్ ద్వారా ఫోటోలను ఆకర్షణీయంగా ఫ్రేమ్ చేయవచ్చు. దీనిలో మ్యాక్రో మోడ్ కూడా ఉంది. ఇది అత్యంత క్లోజప్ ఫోటోలను తీయడంలో సహాయపడుతుంది. మరింత సహజ అనుభవాన్ని ఇవ్వడానికి ఈ ఫోన్‌కి ప్రత్యేకంగా ఫిజికల్ షట్టర్ బటన్ ను ఏర్పాటు చేశారు. ఇది హాఫ్ ప్రెస్‌తో ఫోకస్ చేస్తుంది, లాంగ్ ప్రెస్‌తో షూట్ చేస్తుంది.
ఇక స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 6.85 అంగుళాల 1.5K OLED BOE Q9+ డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో 3nm Snapdragon 8 Elite ప్రాసెసర్, Adreno 830 GPU ఉన్నాయి. మెమరీ పరంగా ఇది 12GB లేదా 16GB LPDDR5X RAM, అలాగే 256GB లేదా 512GB UFS 4.0 స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ Android 15 ఆధారిత Nebula AIOS 1.5 తో వస్తుంది. కెమెరా సెటప్‌లో 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్, 64MP టెలిఫోటో లెన్స్, 16MP అండర్-డిస్ప్లే సెల్ఫీ కెమెరా ఉన్నాయి. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IR సెన్సార్ లు ఉన్నాయి. ఇక 6600mAh బ్యాటరీకి, 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉండటంతో నీరు, దుమ్ము నుండి పరిరక్షణ కల్పిస్తుంది. కనెక్టివిటీ విషయంలో Wi-Fi 7, Bluetooth 5.4, 5G, NFC, USB Type-C వంటి ఆధునిక ఫీచర్లు అందించబడుతున్నాయి. ఇవన్నీ కలిపి nubia Z70S Ultra ని ఒక పవర్‌ఫుల్ ఫోటోగ్రఫీ ఫోనుగా మలిచాయి.
ఇక ధర విషయానికి వస్తే.. nubia Z70S Ultra 12GB + 256GB వేరియంట్ 779 డాల్లర్స్ (దాదాపు రూ. 61,460), అలాగే nubia Z70S Ultra 16GB + 512GB వేరియంట్ 869 డాలర్స్ (దాదాపు రూ. 69,885)గా నిర్ణయించారు. ఈ ఫోన్‌తో పాటు nubia Pad Pro ను కూడా గ్లోబల్ మార్కెట్ కోసం ప్రకటించింది. ఇది జూన్ 12, 2025న విడుదల కానుంది. అయితే, దాని ధరల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. మొత్తంగా చూస్తే, nubia Z70S Ultra కెమెరా, డిజైన్, బ్యాటరీ పరంగా ప్రొఫెషనల్ యూజర్లను ఆకట్టుకునే విధంగా రూపొందించబడింది.