
itel A90: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ itel తన బడ్జెట్ A సిరీస్‌ను మరింత విస్తరించింది. తాజాగా itel A90 పేరుతో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన itel A80 కు అప్డేటెడ్ గా వచ్చింది. ధరను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌లో ఉపయోగకరమైన స్పెసిఫికేషన్లు అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫోన్ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 90Hz కాగా, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో మరింత స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది. డైనమిక్ బార్ ఫీచర్ ద్వారా లైవ్ అలర్ట్స్ కనిపిస్తాయి. ఇది ఇటీవలి itel ఫోన్లలో కామన్‌గా లభ్యమవుతోంది. ప్రాసెసింగ్ పరంగా చూస్తే, ఈ ఫోన్ UNISOC T7100 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది 4GB RAM (8GB వరకు వర్చువల్ RAM) తో కలిపి మరింత మెరుగైన పనితీరును అందిస్తుంది. Android 14 Go Edition పై నడుస్తోంది. అలాగే, IP54 రేటింగ్ కలిగి ఉండడంతో పట్టు ధూళి, నీటి నుంచి రక్షణ కలిగిస్తుంది.
ఇతర ముఖ్యమైన ఫీచర్లలో AI సహాయకుడు అయిన Aivana 2.0 ఉంది. ఇది డాక్యుమెంట్ల ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, ఫోటోలను వివరించడం, వాట్సప్ కాల్స్ చేయడం, గణిత సమస్యలను పరిష్కరించడం వంటి పనులను చక్కగా నిర్వహించగలదు. ఇక కెమెరా విభాగంలో 13MP బ్యాక్ కెమెరా LED ఫ్లాష్‌తో, 5MP ఫ్రంట్ కెమెరాతో వస్తోంది. 3.5mm ఆడియో జాక్, DTS సౌండ్ సపోర్ట్‌తో మ్యూజిక్ లవర్స్‌కు అదనపు బోనస్ గా లభించనున్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో ఫోన్‌కు భద్రత కల్పించారు.
5000mAh బ్యాటరీ కలిగి ఉన్న ఈ ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. బాక్స్‌లో 10W ఛార్జర్ లభిస్తుంది. కనెక్టివిటీ విషయాల్లో డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.0, USB Type-C పోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇక ఈ itel A90 స్టార్లిట్ బ్లాక్, స్పేస్ టిటానియం రంగుల్లో లభ్యమవుతుంది. 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,499 కాగా, 128GB వేరియంట్ రూ. 6,999 కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఇప్పటికే రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. కొనుగోలుదారులకు JioSaavn Pro మూడు నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.