Leading News Portal in Telugu

Best Camera Phones Under Rs 15000: Capture Stunning Photos Without Breaking


Best Camera Phones: కలర్‌ఫుల్‌ మెమరీస్‌కు రూ.15,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే..!

Best Camera Phones: ఈరోజుల్లో మంచి ఫొటోలు తీయాలంటే ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లనే కొనడం తప్పనిసరి కాదు. అత్యద్భుతమైన కెమెరా ఫోన్లు కేవలం రూ. 15,000 లోపు కూడా మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. సెల్ఫీల నుంచి స్ట్రీట్ ఫొటోగ్రఫీ వరకు ఇవి అందించబోయే కెమెరా క్వాలిటీకి తిరుగులేదు. మరి అధిక క్వాలిటీ ఇచ్చే కెమెరా బడ్జెట్ ఫోన్ల వివరాలు మీకోసం..

Realme C55:
మార్కెట్ దాదాపు రూ. 11 వేలు దగ్గరగా ఉన్న ఈ మొబైల్ లో 64MP కెమెరా ఉండడడం ఆశ్చర్యపరిచే అంశం. నైట్ ఫిల్టర్, AI బ్యూటీ మోడ్‌తో కూడిన ఈ ఫోన్ మీ ఫోటోలను గ్యాలరీ నుంచే స్టన్నింగ్‌గా మార్చేస్తుంది.

Poco M6 Pro 5G:
దాదాపు రూ. 10,500 ఉన్న ఈ మొబైల్ లో AI ఫీచర్లతో కూడిన 50MP డ్యూయల్ కెమెరాతో మంచి ఫోటోలు ఇవ్వడంలో ముందుంది. మరి ఆలశ్యం ఎందుకు ఫోటోగ్రఫి లవర్స్ ఈ ఫోన్ వెంటనే సొంతం చేసుకోండి.

Moto G32:
50MP ప్రైమరీ కెమెరా + 8MP అల్ట్రా వైడ్ + 2MP మాక్రో కెమెరాలు ఇందులో ఉన్నాయి. నేచురల్ లుక్ ఇష్టపడే వారికి ఇదే ఎంతో ఉపయోగపడుతుంది. డీటెయిల్ మిస్ కాకుండా, ఓవర్ ప్రాసెసింగ్ లేకుండా ఫోటోలు వచ్చేస్తాయి. ఈ మొబైల్ రూ. 10,500 లకు సొంతం చేసుకోవచ్చు.

Realme Narzo N55:
64MP ప్రధాన కెమెరా + 2MP డెప్త్ సెన్సార్ తో ఫోటోలు కాస్త కాంతివంతంగా, స్పష్టంగా వస్తాయి. కెమెరా యాప్‌లో ఉన్న ఫిల్టర్లు ఫన్ యాడ్ చేస్తాయి. సెల్ఫీలు కూడా చాలా స్పష్టంగా వస్తాయి. ఈ మొబైల్ ను రూ. 11000 లోపే సొంతం చేసుకోవచ్చు.

Redmi 13C 5G: – దాదాపు ₹11,000
ఈ ఫోన్ పగటి ఫోటోల కోసం మంచి డిటెయిల్, బేసిక్ నైట్ మోడ్ కోసం ఈ ఫోన్ బాగా ఉంటుంది. సెల్ఫీ కెమెరా కూడా సామాన్య వినియోగానికి సరిపోతుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా + AI లెన్స్
కెమెరాతో వస్తోంది. సోషల్ మీడియా పోస్టుల ఫోటోల కోసం ఇది చక్కగా సరిపోతుంది. ఈ మొబైల్ కూడా రూ. 11000 లోపే సొంతం చేసుకోవచ్చు.

Lava Blaze 5G: – సుమారు ₹11,000
ఇది భారతీయ బ్రాండ్ గా గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ లో 50MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ 50MP కెమెరా డే లైట్ షాట్లను డీసెంట్‌గా తీస్తుంది. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ వాడకాన్ని స్మూత్‌గా ఉంచుతుంది.

Infinix Zero 5G:
ఇన్‌ఫినిక్స్ అనగానే ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. ఈ ఫోన్ 50MP కెమెరాతో 4K వీడియోలు కూడా తీయగలదు. ఈ ఫోన్ ధర 13,000 మాత్రమే. ఈ ధరలో ఇది అరుదైన ఫీచర్. వీడియో షూటింగ్‌ ప్రేమికుల కోసం ఇది బెస్ట్ చాయిస్.

Samsung Galaxy M14 5G: – సుమారు ₹13,500
ఈ మొబైల్ 50MP మెయిన్ కెమెరా + 2MP డెప్త్ + 2MP మాక్రో, 13MP ఫ్రంట్ కెమెరాలను కలిగి ఉంది. ఇది కలర్స్ ను ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తుంది. 50MP ప్రైమరీ కెమెరా ఎక్కువ లైటింగ్ ఉన్న సమయాలలో కూడా బాగానే పని చేస్తుంది. 13MP సెల్ఫీ కెమెరా వీడియో కాల్స్, ఇన్‌స్టా పోస్టులకు పర్‌ఫెక్ట్.