Leading News Portal in Telugu

AI Blackmail Developer: I will Expose Your Affair If You Replace Me.. Shocking Chat Goes Viral


AI Blackmail Developer:నీ అక్రమ సంబంధాలను బయట పెడతా జాగ్రత్త.. డెవలపర్ను బెదరించిన ఏఐ..!

AI Threatens Developer: ప్రతిరోజు ఏదో రకమైన కొత్త టెక్నాలజీ వస్తున్న నేపథ్యంలో అవి మనిషి జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రస్తుత సమాజంలో దాదాపు అన్ని రంగాల్లోనూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చురుకుగా పనులు చేపడుతుంది. మానవ మేధస్సుకు ఏమాత్రం తీసుకొని విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుత రోజుల్లో ప్రజల జీవితాలలో ఎంతో కీలకంగా మారింది. నిజం చెప్పాలి అంటే మానవ మేధస్సు కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలివి ఇప్పుడు ఎక్కువైందని చెప్పవచ్చు. ఇందుకు కారణం తాజాగా జరిగిన ఓ పరిణామం. అసలు విషయంలోకి వెళితే…

నిజానికి, ఏఐ ఎవరైనా సులభంగా యాక్సిస్ చేసుకోగలరు. మనకు కావలసిన సమాధానాలు ఇవ్వడం.. అలాగే ఏదైనా అవసరమైన ఆ విధంగా డాక్యుమెంట్ రూపంలో రాసి ఇవ్వమని చెప్పిన దాన్ని తగ్గట్టుగా సమాచారాన్ని పొందుపరచడం, ఇంకా సాఫ్ట్వేర్ రంగంలో కోడింగ్ చేయడం లాంటి ఎన్నో పనులను సెకన్ల వ్యవధిలో పూర్తి చేస్తుంది. ఇకపోతే తాజాగా ఓ సాఫ్ట్వేర్ డెవలపర్ ను బ్లాక్ మెయిల్ చేసిన ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ అవుతుంది అవుతోంది.

ఈ ఘటనలో సాఫ్ట్వేర్ డెవలపర్ ఏఐ నుంచి వచ్చిన సమాధానం విని షాక్ గురయ్యాడు. నిజానికి అతడు ఏఐతో సంభాషణ జరుగుతున్న సమయంలో.. ప్రస్తుతం ఉన్న ఏఐ మోడల్ వర్షన్ కంటే డెవలపర్లు అప్డేట్ చేసిన ఏఐ కొత్త వర్షన్ ను రీప్లేస్ చేస్తున్నట్లుగా సంభాషణలో తెలిపాడు. అంతే, ఈ సంభాషణ జరిగిన సమయంలో ఏఐ ఇచ్చిన సమాధానంతో డెవలపర్ కంగుతిన్నాడు. ఎందుకంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాధానం అలాంటిది మరి.

ఒకవేళ తనను (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ని రీప్లేస్ చేస్తే.. అతనికి ఉన్న అక్రమ సంబంధాన్ని బయటపెడతానని హెచ్చరించడంతో అతడు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యాడు. ఈ విషయాన్ని కాస్త అతడు సోషల్ మీడియా వేదికగా విషయాన్ని పంచుకోగా.. అది కాస్త వైరల్ గా మారింది. అయితే, ఈ సంభాషణకు సంబంధించి కొందరు టెక్ నిపుణులు వివిధ రకాలుగా విశ్లేషిస్తున్నారు. బహుశా ఆ సాఫ్ట్వేర్ డెవలపర్ తన పర్సనల్ విషయాలకు సంబంధించిన విషయాలను స్టోరేజ్ లో సేవ్ చేసుకోవడం, లేక ఆన్లైన్లో ఉంచడం చేయడం ద్వారా దానిని పసిగట్టి ఇలాంటి బెదిరింపులకు పాల్పడి ఉంటుందని విశ్లేషిస్తున్నారు.