Leading News Portal in Telugu

iQOO Neo 10 Launched in India with 50MP Camera, 6.78 inches Display, 7000mAh Battery and Free TWS 1e Earbuds


iQOO Neo 10: 50MP కెమెరా, 6.78 అంగుళాల డిస్‌ప్లే, ఉచితంగా TWS 1e ఇయర్‌బడ్స్ తో  iQOO నియో 10 లాంచ్..!

iQOO Neo 10: iQOO తాజాగా తన కొత్త ఫ్లాగ్‌షిప్‌ స్థాయి ఫోన్ iQOO Neo 10 ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. ఇది Neo 10 సిరీస్‌లో లేటెస్ట్ మొబైల్ గా వచ్చింది. మంచి ప్రాసెసర్, సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ సామర్థ్యం వంటి ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్‌లో మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. మరి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ను వివరంగా ఇలా ఉన్నాయి.

డిస్‌ప్లే:
ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే (2800×1260 పిక్సెల్స్) ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, HDR10+ సపోర్ట్, 5500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. అలాగే ఇది 4320Hz PWM డిమ్మింగ్, DC డిమ్మింగ్, MEMC సపోర్ట్ కూడా కలిగి ఉంది.

ప్రాసెసర్:
iQOO నియో 10 మొబైల్ Qualcomm Snapdragon 8s Gen 4 (4nm) చిప్‌సెట్‌ను ఉపయోగిస్తోంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి పనుల్లో సూపర్ ఫాస్ట్ పనితీరు అందించేందుకు LPDDR5X Ultra RAM (9600 Mbps), UFS 4.1 స్టోరేజ్ వాడబడింది. ఫోన్‌లో Q1 ఇన్‌డిపెండెంట్ గ్రాఫిక్స్ చిప్ ఉండటం వలన హార్డ్‌వేర్ స్థాయిలో 1.5K + 144FPS సూపర్-రిసల్యూషన్, సూపర్ ఫ్రేమ్ కాన్కరెన్సీ లభిస్తుంది. అలాగే 7K ఐస్ డోమ్ లిక్విడ్ కూలింగ్ కూడా ఇందులో ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా నడిచే Funtouch OS 15 పై పనిచేస్తోంది. ఇది 3 OS అప్‌డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందుకోనుంది.

కెమెరా:
iQOO నియో 10 మొబైల్ లో కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా (Sony LYT-600 / IMX882 సెన్సార్, OIS సపోర్ట్‌తో), 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగి ఉంది. అలాగే ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ముందు వెనుక కెమెరాలతో 4K 60fps వంటి క్వాలిటీ వీడియో రికార్డింగ్ చేయవచ్చు.

బ్యాటరీ:
ఈ ఫోన్‌లో 7000mAh సిలికాన్ బ్లూవోల్ట్ బ్యాటరీ ఉంది. దీనికి 120W ఫ్లాష్ చార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఇది కేవలం 19 నిమిషాల్లో 50%, 36 నిమిషాల్లో 100% ఛార్జ్ అవుతుంది. అలాగే ఈ మొబైల్ లో బైపాస్ ఛార్జింగ్, 100W PPS/PD ఫ్లాష్ చార్జింగ్, 44W UFCS ఫ్యూజన్ ఛార్జింగ్ కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇతర ఫీచర్లు:
ఇక ఈ మొబైల్ లో ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో.. IP65 రేటింగ్‌తో డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. అలాగే స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, Bluetooth 5.4, USB Type-C 2.0, ఇన్ఫ్రారెడ్ సెన్సార్ లు ఉన్నాయి. ఈ మొబైల్ ఇంఫెర్నో రెడ్, టైటానియం క్రోమ్ అనే రెండు రంగులలో లభ్యమవుతుంది.

ధరలు:
iQOO Neo 10 స్మార్ట్‌ఫోన్ వివిధ వేరియంట్లలో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఇందులో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,999గా నిర్ణయించబడింది. అదే విధంగా 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 33,999, 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 35,999కి లభ్యమవుతుంది. ఇక టాప్-ఎండ్ వేరియంట్ అయిన 16GB RAM + 512GB స్టోరేజ్ మోడల్‌ను రూ. 40,999కి మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. అన్ని వేరియంట్లు జూన్ 2వ తేదీ నుండి ప్రీ-బుకింగ్‌కు, జూన్ 3వ తేదీ నుండి అందుబాటులోకి రానున్నాయి.

ఈ ఫోన్‌ను అమెజాన్, iQOO అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మే 26 మధ్యాహ్నం 1గంట నుంచి ప్రీ-బుకింగ్ ప్రారంభమవుతుంది. జూన్ 2న ప్రీ-బుక్ చేసిన వారికి, జూన్ 3 నుంచి ఇతరులకు లభ్యం అవుతుంది. ఇక ప్రీ-బుకింగ్ ఆఫర్స్ కింద.. iQOO TWS 1e ఇయర్‌బడ్స్ ఉచితంగా అందుకోవచ్చు. ఇక SBI కార్డు వినియోగదారులకు రూ. 2000 ఇన్స్టెంట్ డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ బోనస్ కింద రూ.2000 (ఇతర బ్రాండ్లు) అలాగే రూ. 4000 (vivo/iQOO బ్రాండ్లు) లకు లభిస్తుంది. అలాగే 6 నెలల వరకు నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా లభిస్తుంది.