Leading News Portal in Telugu

OnePlus 13s Set to Launch in India on June 5: Expected Price, Features, and Specifications Revealed


OnePlus 13s: ఆల్ సెట్.. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 6.32 అంగుళాల డిస్ప్లే తో లాంచ్ కాబోతున్న వన్‌ప్లస్ 13ఎస్..!

OnePlus 13s: వన్‌ప్లస్ కంపెనీ తమ తాజా స్మార్ట్‌ఫోన్ మోడల్ వన్‌ప్లస్ 13ఎస్ (OnePlus 13s) ను భారతదేశంతో సహా గ్లోబల్ మార్కెట్లలో జూన్ 5న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయబోతుంది. ఇది ‘S’ సెరోస్ లో వచ్చే మొదటి మోడల్. ఈ ఫోన్ గురించిన వివరాలు ఇప్పటికే చాలా వరకు లీక్ అయ్యాయి. ఆ లీక్ సమాచారంలో ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో వస్తుండడంతో ఫ్లాగ్‌షిప్ పనితీరు అందించనుంది. ఈ మొబైల్ ధర ఇంకా అధికారికంగా వెల్లడించకపోయినా.. వన్‌ప్లస్ ఇండియా సీఈఓ రాబిన్ లియు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ ఫోన్ ధర రూ. 42,999 నుండి రూ. 69,999 మధ్య ఉండే అవకాశం ఉంది. మొబైల్ లాంచ్ అయిన తర్వాత, ఇది వన్‌ప్లస్ అధికార వెబ్‌సైట్, అమెజాన్ ఇండియా, ఇంకా ఇతర రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.

ఒన్‌ప్లస్ 13ఎస్ బ్లాక్ వెల్వెట్, పింక్ సాటిన్, గ్రీన్ సిల్క్ లాంటి మూడు ఆకర్షణీయమైన రంగులలో వస్తోంది. ఈ కొత్త రంగులలో వెల్వెట్ గ్లాస్ ఫినిష్ ఉంటుంది. ఇక ఫోన్ మందం 8.15mm కాగా.. బరువు 185 గ్రాములు మాత్రమే. వన్‌ప్లస్ 13ఎస్ ఫోన్‌ లో 6.32 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. ఇది Full HD+, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇక డిస్‌ప్లేలో గ్రీన్ లైన్ సమస్య వస్తే లైఫ్‌టైమ్ వారంటీ ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌లో Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉంటుంది. దీన్ని క్రయో-వెలాసిటీ వేపర్ చాంబర్, బ్యాక్ కవర్‌పై కూలింగ్ లేయర్‌తో శీతలీకరణకు అనుకూలంగా తయారు చేశారు. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15 తో రాబోతుందని సమాచారం.

ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో.. 32 మెగాపిక్సెల్ కెమెరాగా ఉండి, ఆటో ఫోకస్ సపోర్ట్ చేస్తుంది. వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండనుందని సమాచారం. వన్‌ప్లస్ తెలిపిన వివరాల ప్రకారం, వన్‌ప్లస్ 13ఎస్ ఇప్పటి వరకు వచ్చిన ఫోన్‌లలో అత్యుత్తమ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటుందని తెలిపింది. ఒక్కసారి ఛార్జ్ చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ బ్రౌజింగ్‌తో 16 గంటలు, మొత్తం ఉపయోగంలో 24 గంటల వరకు పని చేస్తుందని తెలిపింది. అలాగే ఈ ఫోన్‌లో “ప్లస్ కీ” అనే కొత్త బటన్ ఉంటుంది. ఇది సౌండ్, వైబ్రేషన్, డిస్ట్రబ్ మోడ్, AI టూల్స్ వంటి ఫంక్షన్లకు ఒకే ప్రెస్‌తో యాక్సెస్ ఇస్తుంది. ఫోన్‌లో 11 యాంటెన్నాల‌తో కూడిన 360-డిగ్రీ నెట్‌వర్క్ వ్యవస్థ, ఉండడంతో బిల్డింగ్స్, లిఫ్ట్‌ లలో కూడా స్టేబుల్ నెట్‌వర్క్ కనెక్టివిటీని అందించగలదు.