
Airtel vs Jio: భారతదేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలు అయిన భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో తమ బ్రాడ్‌బ్యాండ్ సేవలను వినియోగదారులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. జియో తన బ్రాడ్‌బ్యాండ్ సేవను ‘JioHome’గా ఫైబర్‌తో పాటు ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) సేవలు అందిస్తుంది. అదే విధంగా, ఎయిర్‌టెల్ కూడా తన వై-ఫై (Wi-Fi) పేరుతో సేవలను అందిస్తోంది. మరి ఈ రెండు కంపెనీలు అందిస్తున్న ఎంట్రీ లెవల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను చూసి అందులో ఏది ఉత్తమమైనది చూద్దాం..
జియో ఎంట్రీ లెవల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్:
రిలయన్స్ జియో ఎంట్రీ-లెవల్ ప్లాన్ రూ.399 ప్రారంభ ధరకు లభిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులకు 30 Mbps స్పీడ్, నెలకు 3.3TB డేటా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌లో ఎలాంటి ఓటీటీ బెనిఫిట్స్ ఉండవు. కానీ, రూ.599 ప్లాన్ తీసుకుంటే జియో సెట్‌టాప్ బాక్స్‌తో పాటు పలు ఓటీటీ సేవలను ఉచితంగా పొందవచ్చు.
ఎయిర్‌టెల్ ఎంట్రీ లెవల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్:
ఎయిర్‌టెల్ ఎంట్రీ లెవల్ ప్లాన్ రూ.499 ప్రారంభ ధరకు అందుతోంది. ఇది వినియోగదారులకు 40 Mbps వరకు స్పీడ్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో Airtel Xstream Play (22+ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్) ఉచితంగా లభిస్తుంది. నెలకు 3.3TB డేటా లభిస్తుంది. అంతేకాకుండా 6 లేదా 12 నెలల ప్లాన్ తీసుకుంటే ఉచితంగా Wi-Fi రౌటర్ ను కూడా పొందవచ్చు.
మొత్తంగా.. ధర పరంగా చూస్తే జియో ప్లాన్ కొంత చౌకగా ఉంటుంది. అయితే స్పీడ్ పరంగా, ఓటీటీ బెనిఫిట్స్ పరంగా ఎయిర్‌టెల్ ప్లాన్ కొంచెం మెరుగ్గా ఉంటుంది. రెండు ప్లాన్లు వినియోగదారుల అవసరాలను బట్టి మంచి ఎంపికలే. మీ అవసరాల ఆధారంగా మీరు ఎంచుకొని సంబంధిత కంపెనీల వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్‌ను బుక్ చేసుకోవచ్చు.