Leading News Portal in Telugu

Elon Musk launches XChat to take on WhatsApp


  • వాట్సాప్ కు పోటీగా ఎక్స్‌చాట్‌
  • మొబైల్ నంబర్‌ లింక్ చేయకుండానే వాడుకోవచ్చు
XChat: వాట్సాప్ కు పోటీగా ఎక్స్‌చాట్‌.. మొబైల్ నంబర్‌ లింక్ చేయకుండానే వాడుకోవచ్చు

వాట్సాప్ దాదాపు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్న వారందరు ఉపయోగిస్తుంటారు. వాట్సాప్ కు పోటీగా మరో మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ అందుబాటులోకి వచ్చింది. మెసేజింగ్ వరల్డ్ లోకి న్యూ గేమర్ ఎంట్రీ ఇచ్చాడు. అతని పేరు XChat. ఇది ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్. XChat ను టెస్లా CEO ఎలోన్ మస్క్ ప్రారంభించారు. వినియోగదారుల సౌలభ్యం కోసం ఇందులో అనేక ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. దీనిని యూజ్ చేసేందుకు మొబైల్ నంబర్‌ను లింక్ చేయవలసిన అవసరం ఉండదు.

ఎలోన్ మస్క్ సోషల్ మీడియా X ప్లాట్‌ఫామ్ లో పోస్ట్ చేసి XChatను ప్రారంభించారు. దానిలో బిట్‌కాయిన్ స్థాయి ఎన్‌క్రిప్షన్ ఉపయోగించామని తెలిపారు. X తో ఎలోన్ మస్క్ ఆశయం దానిని ఆల్-ఇన్-వన్ యాప్‌గా మార్చడం. వీచాట్ పోటీదారుగా మారడానికి అతని తదుపరి అడుగు XChat. చైనాలో WeChat యాప్ ద్వారా అనేక రకాల సౌకర్యాలు అందించబడుతున్నాయి. ఇందులో మెసేజింగ్, చెల్లింపు, మీడియా, డేటింగ్ వంటి పేర్లు ఉన్నాయి. XChatని ఉపయోగించడానికి, మీరు మీ మొబైల్ నంబర్‌ను లింక్ చేయవలసిన అవసరం లేదు. అది లేకుండా మీరు మెసేజింగ్, ఆడియో, వీడియో, ఫైల్ షేరింగ్ మొదలైనవి చేయవచ్చు. XChatని Xతో అనుసంధానించారు. ప్రస్తుతం XChat పరీక్ష దశలో ఉంది. రాబోయే రోజుల్లో ఇది అన్నిరకాల వినియోగదారులకు విడుదల కానుంది.

XChat ఫీచర్లు

XChat లక్షణాల గురించి ఎలోన్ మస్క్ స్వయంగా సమాచారాన్ని పంచుకున్నారు.

ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్: గోప్యతపై దృష్టి సారించి, ఇది బిట్‌కాయిన్ తరహా ఎన్‌క్రిప్షన్‌ను అందిస్తుంది. హ్యాకర్లు దీనిలోని సందేశాలను హ్యాక్ చేయలేరు.

డిసప్పియరింగ్ మెసేజ్‌లు: సందేశం పంపే వినియోగదారులు తమ గోప్యతను కాపాడుకోవాలనుకుంటే, వారు డిసప్పియరింగ్ మెసేజ్‌ల ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ఇలా చేస్తే ఆటోమేటిక్ గా మెసేజ్ డిలీట్ అవుతుంది.

ఆడియో, వీడియో కాల్ సౌకర్యం: Xchat సహాయంతో, వినియోగదారులు ఆడియో, వీడియో కాల్స్ సౌకర్యాన్ని పొందుతారు. దీని కోసం ఏ నంబర్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేదు.

Xchat లో WhatsApp ని గుర్తు చేసే అనేక ఫీచర్లు ఉన్నాయి. ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లు, అదృశ్యమయ్యే ఫీచర్, వీడియో, ఆడియో కాల్ ఫీచర్. ఈ ఫీచర్లన్నీ WhatsApp లో ఉన్నాయి. అయితే, Xchat ని నంబర్ లేకుండా కూడా ఉపయోగించవచ్చు, WhatsApp లో మొబైల్ నంబర్ లింక్ చేయాల్సి ఉంటుంది.