Leading News Portal in Telugu

DoT Simplifies Prepaid to Postpaid Switching with New OTP-Based Guidelines, 30-Day Gap for First Reversal


Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

Prepaid and Postpaid Switching: మొబైల్ వినియోగదారుల సౌకర్యాన్ని పెంపొందించేందుకు టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ల మధ్య మార్పును ఇకపై ఒకే-సారిగా ఓటీపీ ఆధారిత విధానం ద్వారా సులభంగా చేయవచ్చు. దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు తాజాగా విడుదలయ్యాయి.

ఇందులో భాగంగా.. ప్రస్తుతం వినియోగదారులు ఒకసారి ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్ మారితే, మళ్లీ తిరిగి పోస్ట్‌పెయిడ్ నుండి ప్రీపెయిడ్ కు మారడానికి 90 రోజుల నిర్బంధ కాలం (Cooling-off Period) ఉండేది. అయితే తాజా మార్గదర్శకాల ప్రకారం మొదటి మార్పు తర్వాత కేవలం 30 రోజుల్లోనే మళ్లీ మారేందుకు అనుమతి లభిస్తుంది. అయితే, అదే వినియోగదారు రెండోసారి లేదా ఆపై మరల మార్పును కోరుకుంటే, పాత 90 రోజుల లాక్-ఇన్ కాలం అమలులో ఉంటుంది. మార్పు ప్రారంభించేముందు వినియోగదారుడికి ఈ సమాచారం స్పష్టంగా తెలియజేయాలని DoT స్పష్టం చేసింది.

మొదటి మార్పు తర్వాత 30 రోజుల్లో మళ్లీ మారేందుకు అనుమతించబడుతుంది. కానీ ఆపై జరిగే ప్రతి ఓటీపీ ఆధారిత మార్పుకు 90 రోజుల గడువు వర్తిస్తుంది. ఇది మార్పు ప్రారంభానికి ముందు వినియోగదారుడికి స్పష్టంగా తెలియజేయాలని టెలికాం శాఖ తన అధికారిక X పోస్ట్‌లో తెలిపింది. వినియోగదారులకు మరింత సౌలభ్యం కలిగించేందుకు DoT లాక్-ఇన్ కాలం లోపలే మార్పు కోరితే, వారు అధికారిక PoS (పాయింట్ ఆఫ్ సేల్) కేంద్రాల ద్వారా KYC ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. వినియోగదారు 30 లేదా 90 రోజుల గడువు ముగిసేలోపే మార్పును కోరితే, వారు కేవలం అధికారిక PoS లేదా లైసెన్సీ అవుట్‌ లెట్ వద్ద ప్రస్తుత KYC ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని DoT తెలిపింది.