
Samsung Galaxy A55: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ (Samsung) తన అద్భుతమైన మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Galaxy A55 5G ధరను భారీగా తగ్గించింది. 2024 మార్చి 11న భారతదేశంలో లాంచ్ చేసిన ఈ ఫోన్‌కు గడిచిన కొన్ని నెలల్లో మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం, బేస్ వేరియంట్ ధరపై రూ.11,000 తగ్గింపు లభిస్తోంది. దీని వల్ల దీన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశంగా మారింది. మరి ఈ ఆఫర్ గురించి పూర్తిగా చూద్దామా..
Samsung Galaxy A55 మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. తాజా తగ్గింపుతో ఈ మొబైల్స్ ప్రతి వేరియంట్ పై ఏకంగా రూ.11,000 తగ్గనుంది. అంటే 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్: ఇప్పటి ధర మునుపటి ధర రూ.36,999 ఉండగా ఇప్పుడు అది కేవలం రూ.25,999కే లభిస్తోంది. అలాగే 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.27,999, 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.30,999 కు లభించనుంది. ఈ డీల్ ప్రస్తుతం అమెజాన్ వేదికగా అందుబాటులో ఉంది. అంతేకాకుండా, ICICI Amazon క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.779 క్యాష్‌బ్యాక్ ను అమెజాన్ పే బాలన్స్ రూపంలో పొందవచ్చు. అలాగే ఈ ఫోన్‌కు 1 సంవత్సరం వారంటీ కూడా ఉంది. అదనంగా, ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మీ పాత ఫోన్‌ను మారుస్తే గరిష్టంగా రూ.28,100 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే ఇది ఫోన్ స్థితిపై ఆధారపడి ఉంటుంది.
ఇక శాంసంగ్ గాలక్సీ A55 ముఖ్యమైన స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి.
డిస్‌ప్లే: 6.6 అంగుళాల Super AMOLED స్క్రీన్, FHD+ రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్
స్క్రీన్ ప్రొటెక్షన్: Gorilla Glass Victus+
ప్రాసెసర్: Samsung Exynos 1480 (2.75 GHz క్లాక్ స్పీడ్‌తో)
బ్యాటరీ: 5000mAh, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
కెమెరాలు: 50MP ప్రైమరీ కెమెరా + 12MP అల్ట్రా-వైడ్-ఆంగిల్ కెమెరా + 5MP మాక్రో కెమెరా, ఫ్రంట్ కెమెరా: 32MP సెల్ఫీ కెమెరా
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్: 4 సంవత్సరాల OS అప్‌డేట్స్, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్.
Samsung Galaxy A55 ఫోన్ పెర్ఫార్మన్స్, ఫోటోగ్రఫీ, బ్యాటరీ బ్యాకప్ ఇంకా సాఫ్ట్‌వేర్ సపోర్ట్ పరంగా అద్భుతమైన ఫోన్. అలాగే, శాంసంగ్ కి దేశవ్యాప్తంగా ఉన్న సర్వీస్ సెంటర్లు కూడా వినియోగదారులకు నమ్మకాన్ని కలిగిస్తాయి. మొత్తంగా మీరు మంచి డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కలిగిన ఫోన్ కోసం చూస్తుంటే ఈ మొబైల్ ఇప్పుడు తగ్గించిన ధరతో ఉత్తమ ఎంపిక అవుతుంది.