Leading News Portal in Telugu

Realme Narzo 80 Lite 5G Launched in India


  • రియల్‌మీ నుంచి బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ విడుదల
  • రియల్‌మీ నార్జో 80 లైట్ 5G భారత్ లో విడుదల
  • 6000mAh బ్యాటరీ
Realme Narzo 80 Lite 5G: రియల్‌మీ నుంచి బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ విడుదల.. 6000mAh బ్యాటరీ

రియల్‌మీ మరో బడ్జెట్ ఫోన్ రియల్‌మీ నార్జో 80 లైట్ 5G ని ఈరోజు అంటే జూన్ 16న భారత్ లో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ 6300 చిప్‌సెట్ ఉంది. 6GB వరకు RAM, 128GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 32-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంది. MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను అందిస్తోంది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్‌లో 6000mAh బ్యాటరీని అందించారు.

Realme Narzo 80 Lite 5G, 4GB + 128GB వేరియంట్ ధర రూ. 10,499, 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,499. ఈ ఫోన్ క్రిస్టల్ పర్పుల్, ఒనిక్స్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. జూన్ 23 నుంచి అమెజాన్ ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చ. డిస్కౌంట్ తర్వాత, ఫోన్ ధర.. రూ. 9,999 కు 4GB + 128GB (₹500 తగ్గింపు తర్వాత), రూ.10,799 కు 6GB + 128GB (₹700 తగ్గింపు తర్వాత).

ఫీచర్ల విషయానికి వస్తే.. రియల్‌మీ నార్జో 80 లైట్ 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ 6300 చిప్‌సెట్‌ అమర్చారు. 6GB వరకు RAM, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో జతచేయబడింది. ఈ పరికరం ఆండ్రాయిడ్ 15-ఆధారిత రియల్‌మీ UI 6.0పై పనిచేస్తుంది. గూగుల్ జెమిని ఇంటిగ్రేషన్‌ను కూడా అందిస్తోంది. ఈ ఫోన్ లో ఆటోఫోకస్ సపోర్ట్‌తో 32-మెగాపిక్సెల్ GC32E2 ప్రైమరీ కెమెరా అందుబాటులో ఉంది. కెమెరా సెటప్‌లో పిల్-ఆకారపు LED ఫ్లాష్ కనిపిస్తుంది. దీనితో పాటు, ఈ పరికరం AI ఇమేజింగ్, AI క్లియర్ ఫేస్ వంటి ఎడిటింగ్ ఫీచర్‌లను కూడా అందిస్తుంది. ఈ ఫోన్‌లో 15W వైర్డు, 5W రివర్స్ వైర్డు ఛార్జింగ్‌ను అందించే పెద్ద 6,000mAh బ్యాటరీ కూడా ఉంది.