Leading News Portal in Telugu

Donald Trump smartphone launched with 50MP camera and AI face unlock feature


  • డోనాల్డ్ ట్రంప్ స్మార్ట్‌ఫోన్ విడుదల
  • 50MP కెమెరా, AI ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌
Trump T1 Mobile: 50MP కెమెరా, AI ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో.. డోనాల్డ్ ట్రంప్ స్మార్ట్‌ఫోన్ విడుదల.. ధర ఎంతంటే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెలికమ్యూనికేషన్ వ్యాపారంలోకి ప్రవేశించారు. ఆయన తాజా కంపెనీ ట్రంప్ మొబైల్ T1 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెరికాలో ఉత్పత్తి అవుతుంది. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం, ఆయన దేశీయ కస్టమర్ సపోర్ట్ సెంటర్‌ను కూడా ప్రారంభించారు. డోనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో ఈ కొత్త కంపెనీని ప్రారంభించారు. ట్రంప్‌కు చెందిన ఈ కంపెనీ అమెరికాలో ప్రధాన టెలికాం ఆపరేటర్‌గా పనిచేస్తుంది. ట్రంప్ టెలికాం కంపెనీ మొబైల్ వర్చువల్ నెట్‌వర్క్ ఆపరేటర్‌గా పని చేస్తుంది. ఇది మూడు ప్రధాన అమెరికన్ వైర్‌లెస్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి నెట్‌వర్క్ సామర్థ్యాన్ని కొనుగోలు చేస్తుంది.

ట్రంప్ T1 ఫోన్ ధర, ఫీచర్లు

డోనాల్డ్ ట్రంప్ కంపెనీ ట్రంప్ మొబైల్ స్మార్ట్‌ఫోన్ T1 ఫోన్‌ను విడుదల చేసింది. ఈ గోల్డ్ కలర్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది. దీని ధర $499 (సుమారు రూ. 42,893). ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు నుండి $100 డౌన్‌పేమెంట్‌తో కొనుగోలు చేయవచ్చు.ట్రంప్ మొబైల్ యొక్క T1 ఫోన్ డిస్ప్లే 6.8-అంగుళాలు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే AMOLED ప్యానెల్. ఈ ఫోన్ ప్రాథమిక కెమెరా 50MP, దీనితో 2MP డెప్త్, 2MP మాక్రో కెమెరా సెన్సార్ అందించారు. ఈ ఫోన్‌లో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్‌లో 5000mAh బ్యాటరీ అందుబాటులో ఉంటుంది. ట్రంప్ మొబైల్ మొదటి ఫోన్ ఆండ్రాయిడ్ 15 పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 12GB RAM, 256GB విస్తరించదగిన స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్, AI ఫేస్ అన్‌లాక్‌కు సపోర్ట్ చేస్తుంది.

అమెరికాలో తయారైన స్మార్ట్‌ఫోన్

ట్రంప్ మొబైల్ తన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ T1 ఫోన్‌ను ‘డిజైన్డ్ అండ్ బిల్ట్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్’ అనే ట్యాగ్‌తో మార్కెట్ చేస్తోంది. ఈ ఫోన్ ద్వారా, విదేశీ బ్రాండ్‌లకు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది. ప్రతి సంవత్సరం USలో 60 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లు సేల్ అవుతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లన్నీ US వెలుపల తయారు చేయారవడం గమనార్హం. డోనాల్డ్ ట్రంప్ ‘ది 47 ప్లాన్’ అపరిమిత కాలింగ్, టెక్స్ట్, డేటా, ఉచిత అంతర్జాతీయ కాలింగ్‌ను అందిస్తుంది.

ఈ సర్వీస్ ప్లాన్ నెలకు $47.45 (సుమారు రూ. 4,0787) ఖర్చవుతుంది. ఇది ట్రంప్‌ను 47వ అధ్యక్షుడిగా సూచిస్తుంది. ఈ ప్రణాళికతో, వినియోగదారులు అపరిమిత కాలింగ్, టెక్స్ట్, డేటా వంటి ప్రయోజనాలను పొందుతారు. దీనితో పాటు, ట్రంప్ కంపెనీ 100 కంటే ఎక్కువ దేశాలలో వినియోగదారులకు 24/7 రోడ్‌సైడ్ సహాయం, టెలిహెల్త్ సేవ, పరికర రక్షణ, ఉచిత అంతర్జాతీయ కాలింగ్‌ను కూడా అందిస్తుంది.