Nothing Phone 3 to Launch on July 1, Snapdragon 8s Gen 4, Transparent Design, Over-Ear Headphones Debut Alongside

Nothing Phone 3: బ్రిటన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నథింగ్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Phone 3 ను జూలై 1న భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేయనుందని ప్రకటించింది. అలాగే ఈ ఈవెంట్‌లో కంపెనీ తన తొలి ఓవర్-ఇయర్ ఆడియో ప్రోడక్ట్ Nothing Headphone 1 ను కూడా లాంచ్ చేయనుంది. ఈ ప్రకటన ఇటీవల లీకైన డిజైన్ లీకులు, హార్డ్‌వేర్ రూమర్లను నమ్మేలా చేస్తుంది.
నథింగ్ ఫోన్ 3 లో కొత్త Snapdragon 8s Gen 4 చిప్‌సెట్‌ను వాడుతున్నట్లు కంపెనీ అధికారికంగా తెలిపింది. నథింగ్ సీఈఓ కార్ల్ పే తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కొత్త ప్రాసెసర్ గతంలో ఉపయోగించిన Snapdragon 8+ Gen 1 తో పోలిస్తే CPUలో 36%, GPUలో 88% పెరుగుదల చూపుతుందని తెలిపారు. ఫలితంగా ఈ ఫోన్ మరింత వేగంగా, మృదువుగా పనిచేస్తుందని తెలిపారు.
లీకైన చిత్రాల ప్రకారం, నథింగ్ ఫోన్ 3 గత మోడళ్ల మాదిరిగానే స్పష్టమైన ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ డిజైన్ తో వస్తుంది. అయితే, ఈసారి నథింగ్ మొబైల్ ప్రత్యేక లక్షణమైన Glyph ఇంటర్ఫేస్ ఉండకపోవచ్చని సమాచారం. ఇది బ్రాండ్ డిజైన్‌లో ముఖ్యమైన మార్పుగా భావించవచ్చు. ఇక నథింగ్ ఫోన్ 3 రెండు వేరియంట్లలో విడుదల కానుంది. అందులో 12GB RAM + 256GB స్టోరేజ్ ధర USD 799 (సుమారు 68,000), 16GB RAM + 512GB స్టోరేజ్ ధర USD 899 (సుమారు 77,000) గా ఉండనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ భారత్‌లో ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయించబడుతుంది.