
OnePlus Bullets Wireless Z3: ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ వన్‌ప్లస్ భారత మార్కెట్‌లో తన ఆడియో పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. ఈ క్రమంలో వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్ లెస్ Z3 నెక్‌బ్యాండ్ ను తాజాగా విడుదల చేసింది. కేవలం రూ.1,699 ధరతో లభించే ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ నెక్‌బ్యాండ్ జూన్ 24 నుంచి అమ్మకాలకు అందుబాటులోకి రానుంది. ఈ డివైస్‌ను వన్‌ప్లస్ ఇండియా, అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్ లతోపాటు ఇతర ప్రముఖ రిటైల్ ఔట్‌లెట్లలో కొనుగోలు చేయవచ్చు.
ఈ నెక్‌బ్యాండ్‌కు ప్రధాన ఆకర్షణ 36 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సామర్థ్యం. పూర్తిగా చార్జ్ చేసిన తర్వాత 21 గంటల సేపు కాల్స్ మాట్లాడుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో కేవలం 10 నిమిషాల ఫాస్ట్ చార్జ్‌తో 27 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ లభిస్తుంది. బుల్లెట్స్ వైర్ లెస్ Z3 నెక్‌బ్యాండ్ లో 12.4mm డైనమిక్ డ్రైవర్స్ ఉన్నాయి. ఇవి ఖచ్చితమైన, సమతుల్యమైన సౌండ్‌ను అందించడానికి బాస్ వేవ్ టెక్నాలజీ అనే ప్రత్యేక అల్గారిథమ్‌ను ఉపయోగిస్తాయి. దీని ద్వారా బాస్ పెరుగుతుంది కానీ వోకల్స్ క్లారిటీ తగ్గదు.
ఇందులో బ్యాలన్సుడ్, సెరెనాడే, బాస్, బోల్డ్ అనే నాలుగు EQ మోడ్‌లు ఉన్నాయి. అలాగే, 3D స్పేషియల్ ఆడియో సపోర్ట్‌తో వినికిడి అనుభవాన్ని మరింత స్థాయికి తీసుకెళుతుంది. కాల్స్ సమయంలో వినిపించే చుట్టుపక్కల శబ్దాన్ని తగ్గించేందుకు, ఈ డివైస్‌లో AI ఆధారిత Environmental Noise Cancellation (ENC) టెక్నాలజీను ఉపయోగించారు. దీని వల్ల మాట్లాడే సమయంలో ఫోన్ కాల్ లోని శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది.
మొత్తంగా వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్ లెస్ Z3 తక్కువ ధరలో అధునాతన ఫీచర్లను అందించేలా రూపొందించబడింది. దీని బ్యాటరీ లైఫ్, శబ్ద నాణ్యత, ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యం వంటివి మ్యూజిక్ లవర్స్‌కు, కాల్స్‌ను ఎక్కువ చేసే యూజర్లకు ఒక ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది. రూ. 1,699 ధరకు ఇది అత్యుత్తమ డీల్ అని చెప్పవచ్చు.