
OPPO A5 5G: ఒప్పో ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా మొబైల్లను మార్కెట్లోకి తీసుకొని వస్తోంది. ఒకసైడ్ బడ్జెట్ రేంజ్ మొబైల్స్, అలాగే మరోవైపు మిడ్ రేంజ్ మొబైల్స్ ను ఎక్కువగా అందుబాటులోకి తీసుకొని వచ్చే ఒప్పో మరోసారి ఒప్పో a5 5G తో ముందుకొచ్చేసింది. తాజాగా ఈ మొబైల్ ను భారతదేశంలో ఒప్పో విడుదల చేసింది. ధరకు మించి ఆకట్టుకునే ఫీచర్లతో ఈ మొబైల్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. మరి ఈ మొబైల్ పూర్తి ఫీచర్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా..
ప్రాసెసర్:
ఒప్పో A5 5G లో డైమెన్ సిటీ 6300 చిప్ సెట్ ను వినియోగించారు. ఈ మొబైల్ 6GB/8GB ర్యాంతో లభిస్తుంది. అలాగే దీనిని మరో 8 జీబీ వరకు వర్చువల్ ర్యాంను జత చేసుకోవచ్చు. అలాగే ఈ మొబైల్లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుండగా, మెమొరీ కార్డు ద్వారా 1టీబీ వరకు విస్తరించుకునే అవకాశం కలదు. మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత COLOUR OS 15పై ఆధారపడి పనిచేస్తుంది.
బ్యాటరీ:
ఈ మొబైల్లో కెమెరాతో పాటు చెప్పుకోదగ్గ విషయం బ్యాటరీ. ఈ మొబైల్లో 6000mah భారీ బ్యాటరీ లభించనుంది. ఈ మొబైల్ కి 45w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను అందిస్తుంది. ఈ చార్జర్ ద్వారా 37 నిమిషాల్లో సగం బ్యాటరీని చార్జ్ చేయవచ్చు. ఈ బ్యాటరీ 5 సంవత్సరాలపాటు మెరుగైన పర్ఫామెన్స్ కనబరుస్తుందని కంపెనీ తెలుపుతోంది. వీటితోపాటు డ్యూయల్ సిమ్, బ్లూటూత్, 5g సపోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ధరలు:
ఒప్పో a5 మొబైల్ ఆరోరా గ్రీన్, మిస్ట్ వైట్ వంటి రెండు రంగులలో లభ్యం అవుతుంది. ఇక ఈ మొబైల్స్ ధరల విషయానికొస్తే.. 6gb+128gb వేరియంట్ ధర రూ. 15,499 గా ఉండగా, 8gb+128 జీబీ వేరియంట్ ధర రూ. 16,999గా నిర్ణయించారు. ఒప్పో ఇండియా ఆన్లైన్ స్టోర్ లో ఈ మొబైల్ అందుబాటులో ఉంది. అలాగే ఇతర ఆన్లైన్ ప్లాట్ఫారంలో, ఇంకా ఆఫ్లైన్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంది.