- 50MP సోనీ సెన్సార్ ప్రధాన కెమెరా, 2MP డెప్త్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా.
- 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్.
- 6000mAh భారీ బ్యాటరీ, 15W ఫాస్ట్ చార్జింగ్.
- Dimensity 6300 6nm చిప్‌సెట్, Arm Mali-G57 GPU.
- 4GB + 128GB వేరియంట్ రూ. 9,999.
- లాంచ్ ఆఫర్ కింద HDFC, SBI, Axis బ్యాంక్ కార్డులపై రూ.500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్.

VIVO T4 Lite 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో వినియోగదారులకు తగ్గట్టుగానే బడ్జెట్ సెగ్మెంట్‌లో ఫోన్లను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగానే కొత్తగా vivo T4 Lite 5G ఫోన్‌ను భారత్‌లో అధికారికంగా నేడు (జూన్ 24)న విడుదల చేసింది. అబ్బురపరిచే డిజైన్, శక్తివంతమైన బ్యాటరీ, 5G కనెక్టివిటీతో ఈ మొబైల్ యువతను ఆకట్టుకునేలా డిజైన్ చేయబడింది. ఈ మొబైల్ ప్రారంభ ధర రూ. 9,999 మాత్రమే కావడంతో మరింత ప్రత్యేకంగా మారింది. మరి ఈ పవర్‌ఫుల్ ఫోన్ వివో T4 లైట్ 5G మొబైల్ లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయో ఒక లుక్ వేద్దామా..
డిస్ప్లే: 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్.
ప్రొసెసర్: Dimensity 6300 6nm చిప్‌సెట్, Arm Mali-G57 GPU.
స్టోరేజ్: 4GB/6GB/8GB LPDDR4x RAM తో పాటు 8GB వర్చువల్ RAM, 128GB/256GB ఇంటర్నల్ స్టోరేజ్ (1TB వరకు micro SD విస్తరణ).
సాఫ్ట్ వేర్: Android 15 (Funtouch OS 15) ఆధారంగా రన్ అవుతుంది.
అప్‌డేట్స్: 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ హామీ.
కెమెరా: 50MP సోనీ సెన్సార్ ప్రధాన కెమెరా, 2MP డెప్త్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా.
బ్యాటరీ: 6000mAh భారీ బ్యాటరీ, 15W ఫాస్ట్ చార్జింగ్.
సెక్యూరిటీ: సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, IP64 రేటింగ్ (ధూళి మరియు నీటి చినుగులనుండి రక్షణ).
బరువు: 202 గ్రాములు, కాంపాక్ట్ డిజైన్ 8.19mm మందం.
రంగులు: ప్రిజమ్ బ్లూ, టైటానియం గోల్డ్.
ఇతర ఫీచర్లు:
* Dual 5G సపోర్ట్ (n1, n3, n5, n8, n28B, n38, n40, n77, n78 బ్యాండ్స్)
* డ్యూయల్ 4G VoLTE, Wi-Fi (2.4GHz + 5GHz), బ్లూటూత్ 5.4, GPS, USB Type-C
* 3.5mm ఆడియో జాక్, టాప్ పోర్టెడ్ స్పీకర్
ఈ ఫోన్ జూలై 2 నుంచి ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా వెబ్‌సైట్, ఆఫ్లైన్ స్టోర్ల ద్వారా అందుబాటులో ఉంటుంది. ఇక మొబైల్ ధరల విషయానికి వస్తే.. 4GB + 128GB వేరియంట్ రూ. 9,999, 6GB + 128GB వేరియంట్ రూ.10,999, 8GB + 256GB వేరియంట్ రూ.12,999 లకు అందుబటులో ఉంచింది కంపెనీ. ఇక లాంచ్ ఆఫర్ కింద HDFC, SBI, Axis బ్యాంక్ కార్డులపై రూ.500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.