HONOR X9C 5G Set to Launch in India with Stunning Design, 108MP Camera, and Military-Grade Durability

HONOR X9C 5G: భారతీయ మార్కెట్ ప్రపంచంలోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్ సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. వినియోగదారులను ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసే హానర్ (HONOR) సంస్థ తన తాజా మోడల్ HONOR X9C 5Gను త్వరలోనే భారత్‌లో విడుదల చేయనున్నట్టు అధికారికంగా టీజర్ ద్వారా తెలిపింది. ఈ ఫోన్ ను జూలై నెలలో రాబోతున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా ఈ ఫోన్ లాంచ్ కానునాట్లు సంస్థ ప్రకటించింది.
నిజానికి ఫిబ్రవరి నెలలోనే ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలను కంపెనీ ప్రాథమికంగా చెప్పినప్పటికీ, ఇప్పుడు మరోసారి టీజర్ ద్వారా అధికారికంగా లాంచ్ తేదీ దగ్గర్లో ఉందని సంకేతాలను ఇచ్చింది. ఇప్పటివరకు ఈ ఫోన్ మలేషియా, UAE లాంటి ఆసియా దేశాల్లో లాంచ్ అవ్వగా, యూరప్ లో మాత్రం ఈ మోడల్ ను HONOR Magic 7 Lite పేరుతో లాంచ్ చేశారు. ఇక టీజర్ ను గమనించినట్లయితే, ఈ HONOR X9C 5G మొబైల్ బ్లాక్, గ్రీన్ రంగులలో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు అర్థమవుతుంది. ప్రీమియం లుక్, క్లాస్‌కు తగ్గ డిజైన్ తో ఈ ఫోన్ అద్భుతంగా కన్పడడుతుంది. ఇక మొబైల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే..
కెమెరా:
HONOR X9C 5G మొబైల్ వెనుక భాగంలో 108MP ప్రధాన కెమెరా, 5MP అల్ట్రా వైడ్ కెమెరాలు ఉండనున్నాయి. ఇక వీటికి తోడుగా ఫోటో, వీడియో స్టెబిలిటీ కోసం OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఫీచర్లు కూడా ఉన్నాయి.
బలమైన నిర్మాణం:
ఈ మొబైల్ కు స్విట్జర్లాండ్ SGS నుండి 5-స్టార్ రిలయబిలిటీ సర్టిఫికేట్ లభించింది. వీటితోపాటు IP65 రేటింగ్ ద్వారా దుమ్ము, నీటి చిందులకు ఫోన్ రెసిస్టెంట్‌గా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా 2 మీటర్ల ఎత్తునుండి నుంచి కింద పడినా మొబైల్ దెబ్బ తినని విధంగా దీన్ని రూపొందించారు.
మొత్తంగా.. ఈ ఫోన్ ఒక్క లుక్ కే కాదు. పనితీరు, బలమైన నిర్మాణం, కెమెరా, బ్యాటరీ, స్క్రీన్ ప్రతి అంశంలోను ప్రీమియం అనిపించేలా ఉంది. జూలైలో అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా HONOR X9C 5G భారత్‌లో అధికారికంగా విడుదల కానుంది. ధర మరియు లాంచ్ డేట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు హానర్ సంస్థ పేర్కొంది.