Fairphone Gen 6 Launched: Modular, Repair-Friendly Phone with 8 Years of Updates and 5-Year Warranty
- గ్లోబల్ మార్కెట్ లో ‘ఫెయిర్ ఫోన్ జెన్ 6’ విడుదల.
- మొబైల్ ను వినియోగదారుడే విడగొట్టి, మరమ్మతులు చేసుకునేలా..
- 4415mAh లిథియం-అయాన్ బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్
- 50MP ప్రధాన కెమెరా, 13MP అల్ట్రా వైడ్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా.

Fairphone Gen 6: డచ్ దేశ బ్రాండ్ ‘ఫెయిర్ ఫోన్’ తన మూడవ తరం మరమ్మతులకు అనువైన స్మార్ట్‌ఫోన్ ‘ఫెయిర్ ఫోన్ జెన్ 6’ ను గ్లోబల్ మార్కెట్ లో విడుదల చేసింది. ఈ ఫోన్ టెక్నాలజీతో పాటు పర్యావరణ హితాన్ని కలిపి తీసుకొచ్చిన మోడ్యూలర్ ఫోన్. అది ఎలా అంటే.. ఈ మొబైల్ ను వినియోగదారుడే విడగొట్టి, మరమ్మతులు చేసుకునేలా రూపొందించడమే దీని ప్రధాన లక్ష్యంగా విడుదల చేసింది. మరి ఈ పర్యావరణ హిత మొబైల్ డిజైన్, ప్రత్యేకతలను చూసేద్దామా..
ఈ Fairphone 6 మొబైల్ మొత్తం 12 భాగాల విడదీయగలిగిన నిర్మాణంతో రూపొందించబడింది. వినియోగదారులు తామే కెమెరా, స్క్రీన్, బ్యాటరీ, స్పీకర్లు వంటి భాగాలను విడగొట్టి మార్పు చేసుకోవచ్చు. ఈ ఫోన్ కు సరిపడే ఫింగర్ లూప్, కార్డ్ హోల్డర్, లాన్యార్డ్, స్క్రీన్ ప్రొటెక్టర్, ఫ్లిప్ కవర్, ప్రొటెక్టివ్ కేస్ యాక్సెసరీస్ వస్తున్నాయి. ఈ ఫోన్ లో పునరుత్పాదక పదార్థాలు లేదా ఫెయిర్ మైన్డ్ మినరల్స్ కలిపి 14 రకాల పదార్థాలను ఉపయోగించినట్టు కంపెనీ చెబుతోంది. పైగా ఈ ఫోన్ 100% e-waste neutral అని ప్రకటించింది.
డిస్‌ప్లే, డిజైన్:
* 6.31 అంగుళాల Full HD+ LTPO pOLED డిస్‌ప్లే.
* 120Hz అడాప్టివ్ రిఫ్రెష్‌రేట్.
* 1400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 431ppi పిక్సెల్ డెన్సిటీ.
* Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్.
ప్రాసెసర్, మెమొరీ:
* Snapdragon 7s Gen 3 చిప్‌సెట్.
* 8GB LPDDR5 RAM.
* 256GB UFS 3.1 స్టోరేజ్ (2TB వరకు మైక్రో SD ద్వారా విస్తరణ).
కెమెరా వ్యవస్థ:
* 50MP సోనీ Lytia 700C ప్రధాన కెమెరా, OIS, 10x డిజిటల్ జూమ్.
* 13MP అల్ట్రా వైడ్ కెమెరా.
బ్యాటరీ:
* 4415mAh లిథియం-అయాన్ బ్యాటరీ. (పూర్తిగా వినియోగదారుడే మార్పుచేసేలా (user-replaceable))
* 30W ఫాస్ట్ ఛార్జింగ్
* ఒకసారి ఛార్జింగ్‌తో 12 గంటల వరకు వెబ్ బ్రౌజింగ్ సపోర్ట్
ఇతర ఫీచర్లు:
* Wi-Fi 6E, Bluetooth 5.4, NFC, GPS/A-GPS, Beidou, Galileo, GLONASS
* USB Type-C పోర్ట్.
* సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్.
* ఫేస్ అన్‌లాక్ సపోర్ట్.
* IP55 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్, MIL-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ
* స్మార్ట్ సెన్సార్లు: యాక్సిలెరోమీటర్, గైరో స్కోప్, ప్రాక్సిమిటీ, లైట్ సెన్సార్, బారోమీటర్, e-కంపాస్
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్:
* Android 15 ప్రీ-ఇన్‌స్టాల్డ్.
* 2033 వరకు 8 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ హామీ.
* Fairphone Moments మోడ్ – ఫోన్ వాడకాన్ని వ్యక్తిగతీకరించే ఫీచర్.
ధర:
599 యూరోలు అంటే సుమారుగా రూ. 59,900 UKలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. అదే /e/OS వేరియంట్ ధర 649 యూరోలు అంటే సుమారుగా సుమారుగా రూ. 65,000 గా నిర్ణయించారు. క్లౌడ్ వైట్, ఫారెస్ట్ గ్రీన్, హారిజన్ బ్లాక్ రంగులలో మొబైల్ లభిస్తుంది.