Leading News Portal in Telugu

BSNL Launches 1499 Plan, Calls Without Limits, Support for Soldiers Too


  • బీఎస్ఎన్ఎల్ రూ. 1499 ప్రత్యేక ప్లాన్‌
  • దేశానికి తోడుగా, నమ్మకంగా, వినియోగదారులకు లాభంగా ఉండేలా
  • 336 రోజుల వ్యాలిడిటీ, 24GB డేటా.
  • రీచార్జ్ ద్వారా 5% మొత్తంలో 2.5% భారత సైనిక బలగాల కోసం
  • 2.5% మీకే తిరిగి క్యాష్‌బ్యాక్.
BSNL 1499: ‘దేశానికి తోడుగా’ అంటూ.. కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్..!

BSNL 1499: గత కొంతకాలంగా కొత్త ప్లాన్స్ తో వినియోగదారుల్ని పెంచుకుంటూ దూసుకెళ్తుంది ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL). ఇప్పటికే ఎంతో మంది వినియోగదారుల్ని ఆకట్టుకున్న బీఎస్ఎన్ఎల్, తాజాగా ఓ ప్రత్యేకమైన రీచార్జ్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. “దేశ భక్తితో రీచార్జ్ చేయండి.. గర్వంతో కనెక్ట్ అవ్వండి” అనే నినాదంతో బీఎస్ఎన్ఎల్ రూ. 1499 ప్రత్యేక ప్లాన్‌ ను అందిస్తోంది. ఈ ప్లాన్.. దేశానికి తోడుగా, నమ్మకంగా, వినియోగదారులకు లాభంగా ఉండేలా రూపొందించబడింది.

మరి ఈ ప్రత్యేక రీచార్జ్ ప్లాన్‌ లో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఎలాంటి లాభాలను అందిస్తుందో ఒకసారి చూద్దామా.. ఈ ప్లాన్ పరంగా దేశంలో ఎక్కడికైనా ఎలాంటి పరిమితులు లేకుండా కాల్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ ప్లాన్ లో మొత్తం 336 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. మొత్తంగా కేవలం 24GB డేటా మాత్రమే లభిస్తుంది. ఇక ఇందులో మరో ప్రత్యేకత ఏమిటంటే.. మీరు చేసిన రీచార్జ్ ద్వారా 5% మొత్తంలో 2.5% భారత సైనిక బలగాల కోసం కేటాయించబడుతుంది. అలాగే 2.5% మీకే తిరిగి (క్యాష్‌బ్యాక్ లేదా ఇతర రూపంలో) వస్తుంది.

ఈ ప్రత్యేకమైన దేశభక్తి ప్లాన్ జూన్ 30, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే రీచార్జ్ చేసుకోవాలంటే మంచి సమయం ఇది. మీరు ఈ ప్లాన్‌ ను సులభంగా బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్ లేదా బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. యాప్‌లో అనుసంధానమైన పేమెంట్ ఆప్షన్ల ద్వారా వెంటనే మీ నెంబర్‌కు రీచార్జ్ చేసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ 1499 ప్లాన్ కేవలం నెట్‌వర్క్‌ సేవ మాత్రమే కాదు. ఇది దేశభక్తికి చేయునితి అందించేలా రూపొందించబడింది. మీరు చేస్తోన్న ప్రతి రీచార్జ్‌తో భారత సైనికుల సేవలకు చిన్నపాటి సహకారం అందుతుంది. ఇది ఒక విధంగా దేశ సేవకు మీరు కూడా భాగమవుతున్నట్టు.