Leading News Portal in Telugu

Thomson qled 43 inch Smart TV Released


  • థామ్సన్ 43-అంగుళాల స్మార్ట్ టీవీ విడుదల
  • ధర రూ. 21,499
Thomson Smart TV: థామ్సన్ 43-అంగుళాల స్మార్ట్ టీవీ విడుదల.. ధర ఎంతంటే?

థామ్సన్ భారత మార్కెట్లో కొత్త స్మార్ట్ టీవీని విడుదల చేసింది. కంపెనీ 43 అంగుళాల QLED టీవీని విడుదల చేసింది. ఈ టీవీ బెజెల్-లెస్ డిజైన్, మెటాలిక్ ఫినిషింగ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10, డాల్బీ డిజిటల్ ప్లస్ లకు మద్దతు ఇచ్చే QLED 4K డిస్ప్లేతో వస్తుంది. ఈ టీవీలో 2GB RAM, 16GB స్టోరేజ్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ ఉన్నాయి. థామ్సన్ 43-అంగుళాల QLED టీవీ ధర రూ. 21,499. ఈ టీవీని ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

థామ్సన్ కొత్త స్మార్ట్ టీవీలో 1 బిలియన్ కలర్స్ తో వచ్చే QLED 4K డిస్ప్లే ఉంది. దీనిలో షార్ప్ విజువల్స్ పొందుతారు. ఈ టీవీలో ARM కార్టెక్స్ A55*4 తో వచ్చే AI PQ ప్రాసెసర్ ఉంది. ఈ టీవీలో HDR10 సపోర్ట్ అందుబాటులో ఉంది. ఇది డాల్బీ అట్మోస్, DTS ట్రూసరౌండ్ లకు మద్దతు ఇస్తుంది. ఈ టీవీ 50W సౌండ్ అవుట్‌పుట్ కలిగి ఉంటుంది. దీని కోసం రెండు స్పీకర్లు అందించారు.

థామ్సన్ స్మార్ట్ టీవీ సొగసైన, బెజెల్-లెస్ డిజైన్, ప్రీమియం మెటాలిక్ ఫినిషింగ్‌తో వస్తుంది. ఈ టీవీ గూగుల్ టీవీ OSలో పనిచేస్తుంది. 10 వేలకు పైగా యాప్‌లకు యాక్సెస్ ఉంటుంది. మల్టీపుల్ పిక్చర్, సౌండ్ మోడ్‌లను పొందుతారు. వాయిస్ కంట్రోల్ అందుబాటులో ఉంది. దీనికి ఇన్-బిల్ట్ గూగుల్ అసిస్టెంట్ ఉంది. దీనితో పాటు, మీరు వాయిస్ కంట్రోల్ సహాయంతో హ్యాండ్ ఫ్రీ నావిగేషన్‌ను ఉపయోగించవచ్చు. ఈ టీవీ 2GB RAM + 16GB స్టోరేజ్‌తో వస్తుంది.