- నథింగ్ నుంచి మరో మొబైల్
- జులై 1న నథింగ్ ఫోన్ 3 రిలీజ్
- 5150 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
- నథింగ్ ‘హెడ్‌ఫోన్ 1’ కూడా లాంచ్

Nothing Phone 3 Launch Date in India: లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల సంస్థ ‘నథింగ్’ మరో మొబైల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. 3 సిరీస్‌లో నథింగ్ ఫోన్ 3ఏను ఇప్పటికే లాంచ్ చేయగా.. ఇప్పుడు ‘నథింగ్ ఫోన్ 3’ను లాంచ్‌కు సన్నాహాలు చేసింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా నథింగ్ ఫోన్ 3ను కంపెనీ జూలై 1న లాంచ్ చేయనుంది. స్మార్ట్‌ఫోన్‌తో పాటు ‘హెడ్‌ఫోన్ 1’ని కూడా నథింగ్ లాంచ్ చేసేందుకు సిద్దమైంది. ఇది కంపెనీ మొదటి హెడ్‌ఫోన్. మరికొన్ని గంటల్లో లాంచ్ కానున్న నథింగ్ ఫోన్ 3 డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
Nothing Phone 3 Camera:
లీక్‌ల ప్రకారం.. నథింగ్ ఫోన్ 3లో 6.7 ఇంచెస్ ఎల్టీఓపీ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉండనుంది. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 చిప్సెట్ ఇవ్వవచ్చు. ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ ఓఎస్‌తో రావచ్చ. ఐదు ఏళ్ల ఆండ్రాయిడ్ అప్డేట్స్ పొందవచ్చు. ఈఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండనుంది. 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉండనుంది. 50 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంటాయని తెలుస్తోంది. 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా రానుంది.
Nothing Phone 3 Battery, Price:
నథింగ్ ఫోన్ 3 ఫోన్ 5150 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో రానుంది. ఇది 100 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వనుంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర దాదాపు రూ.60వేలు ఉంటుందని అంచనా. రెండు కాన్ఫిగరేషన్లలో రానుంది. 12జీబీ+256జీబీ, 16జీబీ+512జీబీతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది పిక్సెల్ 9a, ఐఫోన్ 16eలకు గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ 3 అందుబాటులో ఉంటుంది. మరికొన్ని గంటల్లో ఈ ఫోన్ ఫుల్ డీటెయిల్స్ తెలియరానున్నాయి.