OPPO Reno 14 Pro 5G Launched in India: 6200mAh Battery, 50MP Triple Cameras, Advanced Features Starting at Rs 49999
- ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ Reno 14 Pro 5G భారత్‌లో విడుదల
- ట్రిపుల్ 50MP కాంబినేషన్
- 6.83 అంగుళాల LTPS OLED డిస్ప్లే
- ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు
- IP66, IP68, IP69 రేటింగ్ ధూళి, నీటి నిరోధకత
- 6200mAh భారీ బ్యాటరీ, 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్, 50W AirVOOC వైర్‌లెస్ ఛార్జింగ్.

Oppo Reno 14 Pro 5G: ఒప్పో కంపెనీ తన మోస్ట్ అవైటెడ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ Reno 14 Pro 5Gను భారత్‌లో విడుదల చేసింది. దీంతోపాటు బేస్ వేరియంట్ అయిన Oppo Reno 14 5G కూడా మార్కెట్లోకి వచ్చేసింది. చైనా మార్కెట్ లో ఇదివరకే విడుదలైన ఈ మోడల్స్ ఇప్పుడు భారతీయ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది. అబ్బురపరిచే స్పెసిఫికేషన్లు, పవర్ ఫుల్ కెమెరా సెటప్, భారీ బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్ ప్రత్యేకతలను ఓ సారి చూసేద్దామా..
ప్రాసెసర్:
ఈ కొత్త Reno 14 Pro 5Gలో 4nm MediaTek Dimensity 8450 ప్రాసెసర్ ఉంది. AI ఆధారిత ఫీచర్లు, Google Gemini సపోర్ట్ ఉన్నాయి. అలాగే ఈ ప్రో వేరియంట్ 12GB RAM + 256GB / 512GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.
ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. అలాగే ఫోన్‌కి IP66, IP68, IP69 రేటింగ్ ధూళి, నీటి నిరోధకతలను కలిగి ఉన్నాయి. వీటితోపాటు AI Unblur, AI Recompose, AI Call Assistant, AI Mind Space, Live Photo Export వంటి అధునూతన AI ఫీచర్లు కూడా ఉన్నాయి.
ధర:
Oppo Reno 14 Pro 5G రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభ్యమవుతుండగా.. ఇందులో బేస్ వేరియంట్ 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 49,999గా నిర్ణయించారు. అలాగే హైఎండ్ వేరియంట్ 12GB RAM + 512GB స్టోరేజ్ మోడల్ ధరను రూ. 54,999గా నిర్ణయించారు. ఈ మొబైల్స్ పెర్ల్ వైట్ (Pearl White), టైటానియం గ్రే (Titanium Grey) అనే రెండు రంగుల ఆప్షన్లలో అందిస్తున్నారు. ఈ మొబైల్స్ జూలై 8 నుంచి Oppo India వెబ్‌సైట్, అమెజాన్ ఇంకా ఆఫ్‌లైన్ స్టోర్స్లో అందుబాటులో ఉంటాయి.