- హానర్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్
- హానర్ ఎక్స్9సీ 5జీ రిలీజ్
- 6600 ఎంఏహెచ్ బ్యాటరీ, 108 ఎంపీ కెమెరా

Honor X9c 5G Launched in India: చైనీస్ ఎలక్ట్రానిక్స్ సంస్థ ‘హానర్’ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ‘హానర్ ఎక్స్9సీ 5జీ’ పేరిట కంపెనీ ఈరోజు లాంచ్ చేసింది. గతేడాది నవంబర్‌లోనే గ్లోబల్‌గా రిలీజ్ అయిన ఈ ఫోన్.. భారత మార్కెట్‌లో ఇప్పుడు విడుదల కావడం గమనార్హం. జూలై 12 నుంచి 14 వరకు జరగనున్న ప్రైమ్ డే సేల్ సందర్భంగా ‘అమెజాన్’లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. 6600 ఎంఏహెచ్ బ్యాటరీ, 108 ఎంపీ సూపర్ కెమెరాతో వచ్చింది. హానర్ ఎక్స్9సీ 5జీ ఫుల్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
Honor X9c 5G Features:
హానర్ ఎక్స్9సీ 6.8 ఇంచెస్ 1.5K కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లేతో వచ్చింది. యాంటీ-డ్రాప్ డిస్‌ప్లేను ఇచారు. ఫోన్ 2 మీటర్ల ఎత్తు నుంచి కింద పడినా ఏమీ కాదు. 120 హెడ్జ్ రిఫ్రెష్‌రేట్, 1.5K రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. ఇందులో స్నాప్‌డ్రాగన్ 6 జన్ 1 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత మ్యాజిక్ ఎస్ 9.0 ఉంటుంది. ఏఐ మోషన్ సెన్సింగ్, ఏఐ డీప్‌ఫేక్ డిటెక్షన్, ఏఐ మ్యాజిక్ పోర్టల్ 2.0, ఏఐ ఎరేజ్ లాంటి ఫీచర్లు ఎక్స్9సీల ఉంటాయి.
Honor X9c 5G Camera and Battery:
ఫోన్ వెనక భాగంలో డ్యుయల్ రేర్ కెమెరాను ఇచ్చారు. 108 ఎంపీ మెయిన్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో 6600ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. సింగిల్ ఛార్జ్‌పై మూడు రోజుల వరకు బ్యాటరీ ఉంటుందని కంపెనీ చెబుతోంది. ప్రతిరోజూ ఫోన్‌ను ఛార్జ్ చేసే అవసరం పెద్దగా ఉండదు. ఇది 66W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఐపీ65ఎం రేటింగ్‌ను ఇచ్చారు. ఈ ఫోన్ 7.98 ఎంఎం మందం, 189 గ్రాముల బరువు ఉంటుంది.
Honor X9c 5G Price:
హానర్ ఎక్స్9సీ ఫోన్ ఒకే వేరియంట్‌లో వస్తుంది. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.21,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ పరిమిత రోజుల పాటు రూ.19,999కి అందించబడుతోంది. ఇందులో లాంచ్ డిస్కౌంట్లు, ఎంపిక చేసిన బ్యాంక్ ఆఫర్‌లు ఉన్నాయి. జేడ్ సియాన్, టైటానియం బ్లాక్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది. జులై 12 నుంచి అమెజాన్‌లో హానర్ ఎక్స్9సీ అందుబాటులోకి వస్తుంది.