Leading News Portal in Telugu

Xiaomi Launches 20000mAh Compact Power Bank with Fast Charging and Built-in Cable at Rs 1799


Xiaomi Power Bank: ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అనేలా.. 20,000mAh కంపాక్ట్ పవర్ బ్యాంక్ లాంచ్..!

Xiaomi Power Bank: ప్రముఖ చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షియోమీ (Xiaomi) తాజాగా భారత మార్కెట్లోకి కొత్త 20,000mAh కంపాక్ట్ పవర్ బ్యాంక్ ను విడుదల చేసింది. ఇందులో ప్రత్యేకతగా బిల్ట్-ఇన్ USB టైపు-C కేబుల్, 22.5W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, మల్టీ డివైస్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇది పోర్టబిలిటీకి బాగా అనువుగా రూపొందించబడింది. మరి ఈ కంపాక్ట్ పవర్ బ్యాంక్ సంబంధించిన పూర్తి ఫీచర్లు చూసేద్దామా..

ప్రధాన ఫీచర్లు:
* బ్యాటరీ సామర్థ్యం: 20,000mAh

* ఫాస్ట్ చార్జింగ్: 22.5W స్పీడ్.

* బిల్ట్-ఇన్ USB Type-C కేబుల్.

* చార్జింగ్ పోర్ట్స్: USB Type-A (ఇన్‌పుట్), USB Type-C (ఔట్‌పుట్).

* బరువు: 342 గ్రాములు.

షియోమీ ప్రకారం, ఈ పవర్ బ్యాంక్ ద్వారా iPhone 16 Proకు సుమారు 4 సార్లు, Xiaomi 15 కు సుమారు 2.5 సార్లు, Redmi Note 14 Pro 5G కు సుమారు 3 సార్లు, Xiaomi Pad 7 కు సుమారు 2 సార్లు ఛార్జింగ్ అవుతుంది అని చెప్పింది. అంతేగాక, ఒకేసారి మూడు డివైస్‌లను చార్జ్ చేసే సదుపాయం కూడా ఇందులో ఉంది.

మొత్తంగా Xiaomi 20,000mAh కాంపాక్ట్ పవర్ బ్యాంకు ధరకు తగినట్లుగా ఫీచర్లను అందిస్తోంది. బిల్ట్-ఇన్ కేబుల్, ఫాస్ట్ చార్జింగ్, మల్టీ డివైస్ సపోర్ట్ వంటి అంశాలు దీనిని ట్రావెలింగ్, డైలీ యూజ్‌కు మరింత ఉపయోగకరంగా మారుస్తున్నాయి. మీరు తక్కువ బడ్జెట్‌లో ఓ హై క్వాలిటీ పవర్ బ్యాంక్ కోసం చూస్తున్నట్లయితే ఇది మంచి ఎంపిక.