Leading News Portal in Telugu

itel City 100 Launched in India at Rs 7599 with HD+ Display, AI Features, and 5200mAh Battery


itel City 100: నమ్మలేని ధరలో అత్యాధునిక స్మార్ట్ ఫీచర్లతో వచ్చేసిన ఐటెల్ సిటీ 100..!

itel City 100: ఇండియన్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐటెల్ మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. ఐటెల్ సిటీ 100 పేరుతో వచ్చిన ఈ ఫోన్ ధర కేవలం రూ. 7,599 కాగా, ఇందులో ఉన్న ఫీచర్లు ధరను తక్కువగా అనిపించేవిగా ఉన్నాయి. మరి ఇంత తక్కువలో ఎలాంటి స్పెసిఫికేషన్స్, డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్నాయో పూర్తి వివరాలను ఒక లుక్ వేద్దాం.

ప్రాసెసర్, స్టోరేజ్:
ఈ మొబైల్ Unisoc T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో 4GB RAM ఉండగా, వర్చువల్ RAM తో 12GB వరకు పెంచుకునే వీలుంది. అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఇది బడ్జెట్ సెగ్మెంట్లో అదనపు ఆకర్షణ.

Image (14)

బ్యాటరీ:
ఐటెల్ సిటీ 100 బ్యాటరీ పరంగా చూస్తే.. ఇందులో 5,200mAh భారీ సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీ ఉంది. దీనికి 18W Type-C ఫాస్ట్ చార్జింగ్ మద్దతు ఉంటుంది. కంపెనీ ప్రకారం, ఈ ఫోన్ 60 నెలల వరకూ సాఫీగా పని చేసేలా ఆప్టిమైజ్ చేయబడింది.

కెమెరా, అదనపు ఫీచర్లు:
ఈ ఐటెల్ సిటీ 100 లో 13MP రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. వీటి ద్వారా ఫోటలను మంచి విజువలైజేషన్ గా ఉంటాయి. ఇక ఈ మొబైల్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IR బ్లాస్టర్, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi ఉంటాయి. ఇతర ఫీచర్లలో Android 14 OS పై Aivana 3.0 AI అసిస్టెంట్ ఉంది.

Image (15)

ఇక ఇందులో కొత్తగా అందించేలా ఇమేజ్‌ను వర్డ్/PDF/ఎక్సెల్ ఫైల్‌గా మార్చడం, రెండు వేల్లు ఉంచి టెక్స్ట్ ఎక్స్‌ట్రాక్షన్, AI ఆధారిత రాత అండ్ ఎడిటింగ్, ఇమెయిల్ అడ్రస్ నుండి నావిగేషన్ లాంటి ప్రత్యేక ఫీచర్లను అందించనున్నారు. ఇక ఈ మొబైల్ ఫెయిరీ పర్పుల్, నేవీ బ్లూ, ప్యూర్ టిటానియం వంటి మూడు రంగులలో లభ్యమవుతుంది. దీని ధర రూ. 7,599 మాత్రమే. ఈ మొబైల్ కు మొదటి 100 రోజుల్లో ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ కూడా ఉంది. ఇంకా వీటితోపాటు పరిమితకాల ఆఫర్‌గా రూ. 2,999 విలువ చేసే మాగ్నటిక్ స్పీకర్ ఉచితంగా అందించనున్నారు కూడా..