Realme C71 Budget Smartphone Launched in India with 90Hz Display, 6300mAh Battery and Military-Grade Durability

Realme C71: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్మీ (Realme) తన తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ realme C71 ను భారత మార్కెట్లో నేడు విడుదల చేసింది. గత నెలలో C73 5G లాంచ్ చేసిన తర్వాత ఇప్పుడు C సిరీస్ లో మరో కొత్త బడ్జెట్ మొబైల్ ను తీసుకవచ్చింది. పక్కా బడ్జెట్ ధరలో లభ్యమవుతున్న ఈ ఫోన్ ఆకర్షణీయమైన మంచి ఫీచర్లను కలిగి ఉంది. ముఖ్యంగా 90Hz డిస్ప్లే, భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా నిలబెట్టనున్నాయి.
డిస్ప్లే:
ఈ కొత్త రియల్మీ C71లో 6.67 అంగుళాల HD+ IPS LCD స్క్రీన్ ఇవ్వబడింది. ఇది 90Hz రిఫ్రెష్‌రేట్, 563 nits హెచ్‌బీఎమ్ (HBM) బ్రైట్నెస్ తో వస్తోంది. ఈ ఫోన్‌కు ‘పల్స్ లైట్ డిజైన్’ అనే ప్రత్యేక లైటింగ్ డిజైన్ ఉంది. ఇది 9 రంగుల్లో, 5 కస్టమైజబుల్ మోడ్లలో మెరుస్తూ మెసేజ్‌లు, కాల్స్, చార్జింగ్ స్టేటస్‌కి స్పందిస్తుంది. అలాగే ఇందులో ‘ఆర్మర్ షెల్ ప్రొటెక్షన్’ ఉండటంతో 1.8 మీటర్ల ఎత్తునుండి పడినా, 33 కిలోల ప్రెషర్ వచ్చినా ఫోన్ సేఫ్‌గా ఉండేలా తయారుచేశారు. వీటితోపాటు IP54 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్‌తో ఇది మరింత పదిలంగా ఉంటుంది.
ప్రాసెసర్:
ఈ ఫోన్‌ను Unisoc T7250 12nm ఆక్టా-కోర్ ప్రాసెసర్ శక్తినిస్తుంది. ఇందులో 4GB లేదా 6GB LPDDR4X RAM, అలాగే 64GB లేదా 128GB స్టోరేజ్ ఎంపికలు ఉన్నాయి. ఈ స్టోరేజ్ ను 2TB వరకూ ఎక్స్‌పాండబుల్ మెమరీకి మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ ఉంది. ఈ మొబైల్ Android 16 ఆధారిత realme UI 6.0 పై రన్ అవుతుంది.
కెమెరాలు:
ఈ కొత్త మొబైల్ కెమెరా విషయానికి వస్తే.. వెనుక భాగంలో 13MP Omnivision OV13B సెన్సార్ ఉన్న కెమెరా, ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా తో వస్తోంది.
బ్యాటరీ:
ఈ ఫోన్లో చెప్పుకోతగ్గ ఫీచర్స్ లో మొదటగా బ్యాటరీ గురించి చెప్పవచ్చు. ఇందులో 6300mAh భారీ బ్యాటరీ ఉంది. దీన్ని 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 6W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే ఈ ఫోన్ ఇతర పరికరాలకు పవర్ బ్యాంక్‌లా పనిచేయగలదు.
ఇక మొబైల్ ఇతర ముఖ్య ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5mm ఆడియో జాక్, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi (2.4GHz + 5GHz), Bluetooth 5.2, GPS, GLONASS, Galileo, QZSS సపోర్ట్, USB Type-C పోర్ట్ ఉంటుంది. ఒబిసిడియన్ బ్లాక్, సీ బ్లూ అనే రెండు రంగులలో రియల్మీ C71 అందుబాటులో ఉంటుంది.
ధర:
realme C71 ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్, రియల్మీ వెబ్ సైట్స్ లో, అలాగే ఇతర ప్రధాన రీటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,699గా ఉంది. ఈ వేరియంట్‌కి ఎలాంటి బ్యాంక్ ఆఫర్ అందుబాటులో లేదు. అయితే, 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,699గా ఉండగా.. దీనికి రూ.700 బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీంతో ఈ వేరియంట్‌కి ఫైనల్ ఎఫెక్టివ్ ధర రూ.7,999 అవుతుంది.