Leading News Portal in Telugu

Motorola Edge 60 Fusion vs OnePlus Nord CE 5: Which Mid-Range Phone is Right for You?


Motorola Edge 60 Fusion vs OnePlus Nord CE 5: మిడ్ రేంజ్ లో ఏ ఫోన్ బెస్ట్..? ఎందుకు..?

Motorola Edge 60 Fusion vs OnePlus Nord CE 5: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు అయిన వన్‌ప్లస్, మోటరోలా తమ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో నూతన మోడళ్లను విడుదల చేశాయి. వాటిలో వన్‌ప్లస్ నార్డ్ CE5, మోటోరోలా ఎడ్జ్ 60 ఫుజన్ భారత మార్కెట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇవి రెండూ అత్యాధునిక ఫీచర్లతో, మంచి పనితీరుతో వినియోగదారుల ఆసక్తిని రేపుతున్నాయి. అయితే, మీ అవసరాలకు అనుగుణంగా ఏ ఫోన్ మంచి ఎంపిక అవుతుందో పూర్తి వివరాలతో ఒకసారి చూసేద్దాం..

డిస్‌ప్లే అండ్ డిజైన్:
వన్‌ప్లస్ నార్డ్ CE5 ఫోన్‌లో 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయడమే కాకుండా, 1430 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌ను అందిస్తుంది. ఈ డిస్‌ప్లే గేమింగ్, వీడియోలు, స్మూత్ స్క్రోలింగ్ కోసం అనుకూలంగా ఉంటుంది. ఇక మరోవైపు, మోటరోలా Edge 60 Fusion ఫోన్‌లో 6.7 అంగుళాల కర్వ్డ్ pOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. కర్వ్డ్ డిస్‌ప్లే కారణంగా Edge 60 Fusion కి ప్రీమియం లుక్, హ్యాండ్ ఫీల్ లభిస్తోంది. మొత్తంగా, స్క్రీన్ పరిమాణం, బ్రైట్నెస్ పరంగా Nord CE5 మెరుగ్గా కనిపించినా.. రూపం, డిజైన్ పరంగా Edge 60 Fusion ముందుంది.

Image (1)

ప్రాసెసర్:
వన్‌ప్లస్ నార్డ్ CE5 ఫోన్‌లో Dimensity 8350 Apex 4nm ప్రాసెసర్ వినియోగించబడింది. ఇది మంచి పనితీరు, తక్కువ పవర్ వినియోగంతో వేగవంతమైన అనుభూతిని ఇస్తుంది. ఇందులో CryoVelocity VC కూలింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం వల్ల దీర్ఘకాలిక గేమింగ్‌కు ఇది మరింత అనుకూలంగా మారింది. మరోవైపు, Edge 60 Fusion లో Dimensity 7400 6nm చిప్‌సెట్ ఉంది. ఇది డైలీ వాడకానికి సరిపోతుంది కానీ.. గేమింగ్‌కు అంత శక్తివంతమైనదిగా చెప్పలేం. కాబట్టి ఈ విషయంలో వన్‌ప్లస్ నార్డ్ CE5 బెస్ట్ అనే చెప్పవచ్చు.
విజేత: Nord CE5.

కెమెరా వ్యవస్థ:
కెమెరా సెటప్ విషయంలో రెండు ఫోన్లు ఒకేలా ఉన్నట్లు అనిపిస్తుంది. Nord CE5 ఫోన్‌లో 50MP (Sony LYT-600) ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ముందువైపు 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది రేర్ కెమెరాతో 4K 60fps వీడియోలు, సెల్ఫీ కెమెరాతో ఫుల్ HD 60fps వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అదే, మోటోరోలా ఎడ్జ్ 60 Fusion ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా (Sony LYT-700C, OIS), 13MP అల్ట్రా వైడ్ లెన్స్ మరియు ముందు భాగంలో అధిక క్వాలిటీ కలిగిన 32MP సెల్ఫీ కెమెరా ఉంది. సెల్ఫీ పరంగా Edge 60 Fusion మెరుగ్గా ఉండగా.., కానీ వీడియో సామర్థ్యంలో Nord CE5 ఆధిక్యం. కాబట్టి ఫోటోల కోసం Edge 60 Fusion, వీడియో కోసం Nord CE5 బెస్ట్.

బ్యాటరీ:
బ్యాటరీ సామర్థ్యం విషయంలో Nord CE5 స్పష్టమైన లీడ్ కనపడుతుంది. ఇందులో 7100mAh భారీ బ్యాటరీ ఉండగా, 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తోపాటు బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. ఇది వేడెక్కకుండా ఛార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక ఎడ్జ్ 60 Fusion లో 5500mAh బ్యాటరీ, 68W TurboPower ఛార్జింగ్ ఉంటుంది. ఇది కూడా బాగానే ఉంటుంది. కానీ, Nord CE5 ను పోల్చితే కాస్త వెనుకబడుతుంది.

సాఫ్ట్‌వేర్ అండ్ అప్‌డేట్స్:
Nord CE5 Android 15 ఆధారిత OxygenOS 15 పై రన్ అవుతుంది. ఇందులో వన్‌ప్లస్ నాలుగు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ హామీ ఇస్తోంది. ఇది దీర్ఘకాలిక వినియోగదారుల కోసం పెద్ద ప్లస్ పాయింట్. ఎడ్జ్ 60 Fusion కూడా ఆండ్రాయిడ్ 15 పై రన్ అవుతుంది. మోటరోలా మూడు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల భద్రతా అప్‌డేట్స్ అందించనుంది. కాబట్టి ఈ విషయంలో Nord CE5 బెటర్ గా ఉంటుంది.

Image

ధర:
ధరల పరంగా Edge 60 Fusion కాస్త తక్కువలో లభిస్తుంది. ఇది రూ. 22,999 ప్రారంభ ధరతో 8GB + 256GB, 12GB + 256GB వేరియంట్లలో లభిస్తుంది. Nord CE5 రూ. 24,999 ప్రారంభ ధరతో 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB వేరియంట్లలో అందుబాటులో ఉంది. ధర పరంగా మోటరోలా కొంత సౌకర్యంగా కనిపిస్తున్నా, వన్‌ప్లస్ ఎక్కువ వేరియంట్ల ఎంపిక అందిస్తోంది. మొత్తంగా.. ధరలో Edge 60 Fusion ముందుంది. కానీ, వేరియంట్ ఎంపికలో Nord CE5 బెస్ట్.

మొత్తంగా మీకు ఏది బెస్ట్?
మీరు గేమింగ్, ఎక్కువ పనితీరు, పెద్ద బ్యాటరీ, వేగవంతమైన ఛార్జింగ్, దీర్ఘకాలిక OS అప్‌డేట్స్ వంటి లక్షణాలను కోరుకుంటే వన్ ప్లస్ నార్డ్ CE5 బాగా సరిపోతుంది. ఇది టెక్నాలజీ ప్రియులకు బెస్ట్ ఎంపిక. ఇక తక్కువ బడ్జెట్‌లో మంచి కెమెరా, ప్రీమియం లుక్ కలిగిన కర్వ్డ్ డిస్‌ప్లే, ప్రాక్టికల్ OS అనుభవాన్ని కోరుకునేవారికి మోటోరోలా ఎడ్జ్ 60 Fusion మంచి ఎంపిక. మొత్తంగా.. ఫీచర్ల పరంగా నార్డ్ CE5 బెటర్, స్టైల్, ధర పరంగా ఎడ్జ్ 60 Fusion ఆకట్టుకునే ఫోన్.