
Vivo T4R 5G: వివో తన తదుపరి T-సిరీస్ స్మార్ట్‌ఫోన్ అయిన vivo T4R 5G ను త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్టు అధికారికంగా టీజ్ చేసింది. ఇండియాలో అతిసన్నని క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే ఫోన్ గా దీన్ని అభివర్ణిస్తూ.. మొబైల్ మందం కేవలం 7.39mm మాత్రమేనని కంపెనీ వెల్లడించింది. ఇందుకు సంబంధించి తాజాగా ఓ టీజర్ ను కూడా విడుదల చేశారు.
ఇక టీజర్ చిత్రాన్ని పరిశీలిస్తే.. అతి త్వరలోనే లాంచ్ కానున్న iQOO Z10R తరహా కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉండనుందని స్పష్టమవుతోంది. అంచనాల ప్రకారం, ఇందులో Sony IMX882 సెన్సార్‌తో 50MP ప్రైమరీ కెమెరా, OIS సపోర్ట్, 2MP సెకండరీ కెమెరా ఉండే అవకాశముంది. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉండనుందని సమాచారం. అలాగే ఫ్రంట్, రియర్ రెండింటినుంచి 4K వీడియో రికార్డింగ్ సామర్థ్యం కూడా అందుబాటులో ఉండనుంది.
AP Rains Update: రైతులకు గుడ్ న్యూస్.. వారం రోజులు భారీ వర్షాలు!
vivo T4R 5Gలో 6.77 అంగుళాల FHD+ క్వాడ్ కర్వ్డ్ OLED డిస్ప్లే ఇవ్వనున్నారు. ఇది 120Hz రిఫ్రెష్‌రేట్ ను సపోర్ట్ చేస్తుందని సమాచారం. ఇక వాడుక పరంగా ఇది స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. ఇక హార్డ్‌వేర్ విషయానికొస్తే.. ఇది మీడియాటెక్ Dimensity 7400 చిప్‌సెట్ పై పనిచేసే అవకాశం ఉంది. ఇది 8GB, 12GB RAM వేరియంట్లలో లభించనుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా అధికారిక వెబ్ సైట్, అలాగే ఆఫ్లైన్ స్టోర్లలో కూడా లభించనుంది. అయితే, లాంచ్ తేదీకి సంబంధించి పూర్తి వివరాలను కంపెనీ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.