Leading News Portal in Telugu

Vivo Launches Y50m 5G and Y50 5G Smartphones with SGS Drop Certification, 6000mAh Battery and IP64 Rated in China


Vivo Y50m 5G, Y50 5G: కేవలం రూ.13,000ల ప్రారంభ ధరకే ఇన్ని ఫీచర్లున్న ఫోన్ ఏంటి భయ్యా.. గ్లోబల్ గా విడుదలైన కొత్త వివో మొబైల్స్..!

Vivo Y50m 5G, Y50 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో (Vivo) తన తాజా Y సిరీస్ ఫోన్లైన Y50m 5G, Y50 5G మోడల్స్‌ ను చైనా మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు డిజైన్, కోర్ స్పెసిఫికేషన్లలో ఒకేలా ఉన్నప్పటికీ.. వాటి మధ్య తేడా ర్యామ్ వేరియంట్‌లో ఉంది. Y50m 5G మోడల్ 6GB RAM నుంచి ప్రారంభమవుతుండగా, Y50 5G మోడల్ 4GB RAM నుంచి లభిస్తోంది. మరి ఈ కొత్త మొబైల్స్ గురించి పూర్తి వివరాలను ఒకసారి చూసేద్దామా..

ప్రాసెసర్:
వివో Y50m 5G, Y50 5G మొబైల్స్ MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. వీటిలో 6000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే.. 52 గంటల టాక్‌టైమ్ అందించగలదని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్లు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తాయి.

CM MK Stalin: ఆస్పత్రిలో చేరిన తమిళనాడు సీఎం స్టాలిన్.. కొనసాగుతున్న చికిత్స..!

Image (4)

డిస్ప్లే, కెమెరా:
కొత్తగా విడుదలైన వివో Y50m 5G, Y50 5G ఫోన్లు 6.74-అంగుళాల భారీ డిస్ప్లేతో వచ్చాయి. ఇవి 90Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉండటంతో స్క్రోల్, గేమింగ్ అనుభవం బాగా ఉంటుంది. ఇక కెమెరా సెక్షన్ విషయానికి వస్తే.. రెండు మొబైల్స్ లో 13MP సింగిల్ రియర్ కెమెరా (f/2.2 అపర్చర్), అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా లభిస్తుంది.

Image (3)

సెక్యూరిటీ, కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు:
ఈ రెండు మోడల్స్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, IP64 వాటర్-డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉన్నాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.4, Wi-Fi, USB Type-C, 3.5mm ఆడియో జాక్, OTG, GPS/GLONASS/Beidou/Galileo/QZSS వంటి గ్లోబల్ నావిగేషన్ సపోర్ట్ ఉంది. ఇందులో యాక్సిలెరోమీటర్, ambient లైట్ సెన్సె, e-కంపాస్, ఇన్ఫ్రారెడ్ రిమోట్, proximity సెన్సార్ వంటి అవసరమైనవి అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ ఫోన్లకు SGS ఫైవ్-స్టార్ డ్రాప్ అండ్ ఫాల్ సర్టిఫికేషన్ కూడా ఉంది. ఈ రెండు మోడల్స్ 167.30×76.95×8.19mm పరిమాణాలతో ఉండగా, వాటి బరువు 204 గ్రాములు ఉంది.

Vidadala Rajini: జనం గుండెల్లో జగన్ ఉన్నారు.. మాజీ మంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Image (5)
ధర:
Vivo Y50m 5G:

6GB + 128GB – 1,499 యువాన్స్ (సుమారుగా 18,000)

8GB + 256GB – 1,999 యువాన్స్ (సుమారుగా 23,000)

12GB + 256GB – 2,299 యువాన్స్ (సుమారుగా 26,000)

Image (6)

Vivo Y50 5G:

4GB + 128GB – 1,199 యువాన్స్ (సుమారుగా 13,000)

6GB + 128GB – 1,499 యువాన్స్ (సుమారుగా 18,000)

8GB + 256GB – 1,999 యువాన్స్ (సుమారుగా 23,000)

12GB + 256GB – 2,299 యువాన్స్ (సుమారుగా 26,000).