- OnePlus ఇండియా ఇండిపెండెన్స్ డే సేల్‌ను జూలై 31 నుంచి అధికారికంగా ప్రారంభం.
- OnePlus Nord 5, Nord CE5, OnePlus 13 సిరీస్, OnePlus Pad Go, OnePlus Buds 4 లతోపాటు..
- ఇతర పాపులర్ గాడ్జెట్లపై భారీ ఆఫర్లు.

OnePlus Independence Day Sale: OnePlus ఇండియా ఇండిపెండెన్స్ డే సేల్‌ను జూలై 31 నుంచి అధికారికంగా ప్రారంభించింది. ఈ సేల్ లో భాగంగా వన్ప్లస్ (OnePlus) తమ తాజా ఉత్పత్తులైన OnePlus Nord 5, Nord CE5, OnePlus 13 సిరీస్, OnePlus Pad Go, OnePlus Buds 4 లతోపాటు ఇంకా ఇతర పాపులర్ గాడ్జెట్లపై భారీ ఆఫర్లు అందిస్తోంది. ఈ ఆఫర్లు అమెజాన్, వన్ప్లస్, అలాగే క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్, వన్ప్లస్ ఆఫ్ లైన్ స్టోర్స్, ఫ్లిప్ కార్ట్, మింత్రా, బ్లింకిట్ వంటి ప్రముఖ రిటైల్ ప్లాట్‌ఫామ్‌లపై అందుబాటులో ఉన్నాయి. ఇక OnePlus Pad Lite ను ఆగస్టు 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఓపెన్ సేల్‌కు సిద్ధంగా ఉంచనున్నారు. ఇక ఈ సేల్లో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో ఒక లుక్ వేద్దామా..
Trump Tariff Bomb: ట్రంప్ 25% టారిఫ్ బాంబు.. ఎలక్ట్రానిక్స్, ఫార్మా, టెక్స్టైల్ రంగాలకు భారీ దెబ్బ!
వన్ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్ లో భాగంగా OnePlus 13 కొనుగోలుపై రూ. 7,000 వరకు భారీ తగ్గింపు లభించనుంది. అంతేకాకుండా, 9 నెలల No Cost EMI, 11 నెలల ఫైనాన్స్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లు ఆగస్టు 1 నుంచి 31 వరకు అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు రూ. 3,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభించనుంది.
అలాగే, OnePlus 13R పై వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆగస్టు 17 వరకు 13R లోని 16GB + 512GB వేరియంట్‌పై రూ. 5,000 తగ్గింపు, అలాగే 12GB + 256GB వేరియంట్‌పై రూ. 3,000 తగ్గింపు లభించనుంది. ఇక ఆగస్టు 18 నుంచి 31 వరకు అన్ని వేరియంట్‌లపై రూ. 3,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందించబడుతోంది. అంతేకాకుండా, ఆగస్టు 18 తర్వాత కూడా 16GB + 512GB వేరియంట్‌పై రూ. 2,000 డిస్కౌంట్ కొనసాగుతుంది.
TG Inter Admissions: విద్యార్థులు అలర్ట్.. ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు చివరి అవకాశం!
ఇక OnePlus Pad సిరీస్ పై కూడా ప్రత్యేక డీల్స్ అందుబాటులో ఉన్నాయి. OnePlus Pad Lite కొనుగోలుపై రూ. 2,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్, అలాగే 6 నెలల No Cost EMI సౌకర్యం లభిస్తుంది. అదే విధంగా OnePlus Pad 2, Pad Go పై 12 నెలల No Cost EMI, రూ. 2,000 వరకు డిస్కౌంట్, అలాగే Pad 2 కొనుగోలు చేసిన వారికి Stylo 2 ఉచితంగా లభిస్తుంది. ఈ సేల్స్ వన్ప్లస్ వినియోగదారులకు అధిక విలువను కలిగించే అవకాశాలను కల్పిస్తోంది. EMI సదుపాయాలు, ధర తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో ఈ డీల్స్ మరింత లాభదాయకంగా మారాయి.