Leading News Portal in Telugu

iQOO Z10 Turbo Pro+ with Dimensity 9400+, 8000mAh Battery Launching on Aug 7


iQOO Z10 Turbo Pro+: 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్‌ప్లే, IP65 రేటింగ్ తో సంచనాలను సృష్టించడానికి సిద్దమైన ఐక్యూ!

iQOO Z10 Turbo Pro+: ఆగస్టు 7న iQOO Z10 Turbo Pro+ చైనాలో గ్లోబల్ లాంచ్ కాబోతున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే వచ్చిన రూమర్లను నిజం చేస్తూ.. iQOO ఈ ఫోన్‌లో మిడియా‌టెక్ Dimensity 9400+ ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నట్టు కన్ఫర్మ్ చేసింది. ప్రత్యేకతగా ఇందులో 8000mAh భారీ బ్యాటరీ ఉండనుంది. ఇది హై-పెర్ఫార్మెన్స్ ఫోన్లలో అతి పెద్దది కానుంది. దీని ద్వారా అత్యుత్తమ బ్యాటరీ లైఫ్ ను వాగ్దానం చేస్తోంది కంపెనీ.

త్వరలో విడుదల కానున్న iQOO Z10 Turbo Pro+ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో.. 6.78 అంగుళాల 1.5K ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ ఫుల్ స్క్రీన్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. ఇది చైనాలో అత్యంత బ్రైట్ నెస్ ఇచ్చే స్క్రీన్‌గా పేర్కొనబడుతోంది. ఇందులో in-house అభివృద్ధి చేసిన Q2 గేమింగ్ చిప్ ఉంటుంది. దీని వల్ల గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ మరింత మెరుగ్గా ఉంటుంది.

Vivo T4R Launched: మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. మిలిటరీ గ్రేడ్ డిజైన్, 5700mAh బ్యాటరీలతో వచ్చేసిన వివో కొత్త స్మార్ట్ఫోన్!

Image (12)
ఇక ఈ మొబైల్ లో 8000mAh భారీ బ్యాటరీతో ఇది మార్కెట్‌లో ఉన్న ఇతర ఫోన్ల కంటే ఎక్కువ బ్యాకప్ ఇస్తుంది. నివేదిక ప్రకారం ఈ భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, ఫోన్ మందంలో చాలా తక్కువ పెరగల మాత్రమే ఉంది. ఇది ముందు విడుదలైన Turbo Pro (8.09mm) కంటే పెద్దగా ఉండదు. ఇక కెమెరా, ఇతర ఫీచర్లు (Turbo Pro వేరియంట్ ఆధారంగా) చూసినట్లయితే ఇందులో.. 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్‌తో రానుంది. అలాగే 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా అందించనున్నారు. అలాగే ఇందులో IP65 రేటింగ్ వల్ల పొడి, నీటి చుక్కల నుండి రక్షణ లనిస్తుంది.
Image (11)

Digital Arrest Scam: స్కామర్లకు మహిళా వైద్యురాలు బలి.. రూ.19 కోట్లు మాయం చేసిన కేటుగాళ్లు!

ఈ కొత్త మొబైల్ తో పాటు TWS, పవర్‌బ్యాంక్ కూడా లాంచ్ కానుంది. semi-in-ear నాయిస్ క్యాన్సలేషన్ ఇయర్ బడ్స్ గా iQOO TWS Air3 Pro లాంచ్ కానున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనితోపాటు iQOO 22.5W 10,000mAh పవర్ బ్యాంక్ కూడా ఆగస్టు 7న రిలీజ్ కానుంది. ఇది అతీ తక్కువ బరువు, పల్చని డిజైన్తో వస్తుంది.

Image (9)

అలాగే ఇన్-బిల్ట్ కేబుల్ కలిగి ఉంటుంది. iQOO Z10 Turbo Pro+ ఒక పవర్‌ఫుల్ గేమింగ్ + లాంగ్ బ్యాటరీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నవారికి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. త్వరలోనే పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలు, భారత మార్కెట్‌లో లాంచ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.

Image (8)