- 5700mAh భారీ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- 6.77 అంగుళాల FHD+ 120Hz AMOLED కర్వుడ్ డిస్‌ప్లే
- ఆగష్టు 5 నుంచి అందుబాటులోకి.

Vivo T4R Launched: వివో (vivo) సంస్థ తన T సిరీస్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్ vivo T4R ను భారత్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ ఆధునిక ఫీచర్లతో పాటు ఆకట్టుకునే స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. ఆగష్టు 5 నుంచి ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా eStore, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది. మరి ఈ కొత్త Vivo T4R స్మార్ట్ఫోన్ స్పెసిఫికేషన్లను ఒకసారి చూసేద్దామా..
డిస్ప్లే అండ్ డిజైన్:
vivo T4Rలో 6.77 అంగుళాల FHD+ 120Hz AMOLED కర్వుడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది HDR10+, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, SCHOTT Xensation α గ్లాస్ ప్రొటెక్షన్ ను సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే స్మూత్, విజువల్‌గా ఇంప్రెసివ్‌గా ఉంటుంది.
Naagin Dance: వీడెవడండి బాబు.. కోబ్రాకే ‘నాగిని డాన్స్’ నేర్పిస్తున్నాడు.. వైరల్ వీడియో
ప్రాసెసర్, OS:
ఈ ఫోన్‌కు MediaTek Dimensity 7400 4nm చిప్‌సెట్ అందించారు. ఇది Mali-G615 GPU తో కలిపి వస్తుంది. ఈ ఫోన్‌లో 8GB లేదా 12GB LPDDR4X RAM (12GB వర్చువల్ RAM అదనంగా), 128GB లేదా 256GB UFS 2.2 స్టోరేజ్ ఉంటుంది. ఇది Android 15 ఆధారిత Funtouch OS 15 పై రన్ అవుతుంది. ఈ మొబైల్ కు 2 Android అప్డేట్లు, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు లభిస్తాయి.
కెమెరా:
ఫోటో ప్రియులకు ఈ మొబైల్ లో మంచి కెమెరాలను పొందుపరిచారు. వెనుక భాగంలో 50MP (Sony IMX882) ప్రైమరీ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్, Aura Light సపోర్ట్‌తో రాగా, ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా (Galaxycore GC32E1) ఉంది. ముందు, వెనుక కెమెరాలు 4K 30fps వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తాయి.
బ్యాటరీ, ఛార్జింగ్:
vivo T4Rలో 5700mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని బ్యాటరీ లైఫ్ భారీగా ఉంటుంది.
GHMC Raids: ఈ- కామర్స్ స్టోర్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. ఈగలు, దోమలతో..
రిజిస్టెన్స్ అండ్ బిల్డ్ క్వాలిటీ:
ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్స్, MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యురబిలిటీ తో వస్తుంది. అంటే ఇది పొడి, నీటి, ఉక్కు పరీక్షల్లో అధిక స్థాయిలో తట్టుకొనగలదు.
ఇతర ముఖ్య ఫీచర్లు:
vivo T4R మొబైల్లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, USB Type-C ఆడియో, స్టీరియో స్పీకర్లు, 5G, Wi-Fi 6, Bluetooth 5.4 ఉండనున్నాయి. ఈ మొబైల్ 183.5 గ్రాముల బరువు ఉండగా, 7.39mm మందం కలిగి ఉంది.
ధరలు:
* 8GB + 128GB – రూ.19,499
* 8GB + 256GB – రూ.21,499
* 12GB + 256GB – రూ.23,499
లాంచ్ ఆఫర్లు:
HDFC, Axis బ్యాంక్ కార్డులపై రూ.2000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. లేదా రూ.2000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభించనుంది. అలాగే 6 నెలల వరకు నో కాస్ట్ EMI సౌకర్యం లభించనుంది. మొత్తంగా వివో T4R ఫోన్ విజువల్స్, పనితీరు, బ్యాటరీ, డ్యురబిలిటీ పరంగా ఒక పవర్ ప్యాక్ ఆఫర్ గా నిలవనుంది. 20 వేల లోపు పవర్‌ఫుల్ 5G ఫోన్ కోసం చూస్తున్నవారికి ఇది బెస్ట్ చాయిస్.