
New UPI Rules: డిజిటల్ లావాదేవీల్లో వేగవంతమైన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త UPI నిబంధనలు తీసుకువచ్చింది. నేటి (ఆగస్టు 1) నుంచి ఈ మార్పులు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఇవి వినియోగదారులతో పాటు.. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్‌లకు ప్రభావం చూపనున్నాయి. అయితే, UPI సిస్టమ్‌లో వేగవంతమైన ప్రతిస్పందన, వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు నియంత్రిత డిజిటల్ చెల్లింపులను కల్పించడమే ఈ మార్పుల ముఖ్య ఉద్దేశ్యం. మరి నేటి నుంచి ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటునాయో ఒకసారి చూసేద్దామా..
* రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్:
ఏ యాప్ ద్వారా అయినా రోజుకు 50 సార్లకు మించకుండా బ్యాలెన్స్ చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇది ప్రతి యాప్‌కు ప్రత్యేకం కావడం వల్ల మీరు గూగుల్ పే, ఫోన్‌పే వేర్వేరు యాప్‌లలో విడిగా చెక్ చేయొచ్చు.
* ఆటోపే లావాదేవీలు ఫిక్స్ చేసిన సమయాల్లో మాత్రమే:
ఆటోపే (Scheduled payments) లావాదేవీలు ఇకపై కేవలం మూడు సమయాల్లో మాత్రమే ప్రాసెస్ అవుతాయి. అందులో భాగంగా ఉదయం 10 గంటలకు ముందు, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 మధ్య, రాత్రి 9:30 తర్వాత మాత్రమే ఆటోపే లావాదేవీలు జరుగుతాయి.
Virat Kohli: విరాట్ కోహ్లీ బాత్రూమ్‌లో ఏడ్చాడు.. ఆసక్తికర విషయం చెప్పిన చహల్!
* ఫెయిల్ అయిన లావాదేవీలకు వేగంగా స్టేటస్ అప్‌డేట్:
లావాదేవీ ఫెయిల్ అయితే లేదా విజయవంతమైనా దాని స్టేటస్ వెంటనే కొన్ని సెకన్లలో చూపించాల్సిందిగా యాప్‌లను NPCI ఆదేశించింది. దీని వల్ల వినియోగదారులలో అయోమయం తగ్గనుంది.
* పెండింగ్ లావాదేవీ స్టేటస్ చెక్:
ఒక పెండింగ్ ట్రాన్సాక్షన్‌కు మీరు మొత్తం 3 సార్లు మాత్రమే స్టేటస్ చెక్ చేయవచ్చు. మొదటిసారి 90 సెకన్ల తర్వాత చేసుకోవాలి. ఆపై రెండు ప్రయత్నాలు 45 నుంచి 60 సెకన్ల మధ్య విరామాల్లో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది.
* లింక్ చేసిన బ్యాంక్ ఖాతాల లిస్ట్ చూడడం:
మీ UPI యాప్‌లో లింక్ చేసిన బ్యాంక్ ఖాతాలను చూసేందుకు కేవలం 25 సార్లు మాత్రమే అనుమతిస్తారు.
* పేమెంట్ రివర్సల్ (Reversal) అభ్యర్థనలు:
ఒక వినియోగదారుడు ఒక నెలలో గరిష్టంగా 10 పేమెంట్ రివర్సల్ అభ్యర్థనలు మాత్రమే పంపించగలరు. వాటిలో కూడా ఒక పంపినవారికి గరిష్టంగా 5 అభ్యర్థనలు మాత్రమే అనుమతి ఉంటుంది.
* రిసీవర్ వివరాల్లో పారదర్శకత:
లావాదేవీ జరిగే ముందు రిసీవర్ బ్యాంక్ పేరు కూడా చూపించాలి. ఇది పొరపాట్లు, మోసాలను నివారించడంలో సహాయపడుతుంది.
KA Paul : బెట్టింగ్ యాప్స్ ను నిషేధించాలి.. సుప్రీం కోర్టులో బెట్టింగ్ యాప్స్ కేసు
ఇకపోతే, NPCI తాజాగా విడుదల చేసిన సర్క్యులర్‌లో “Check Transaction Status” APIలను అతి వాడకం వల్ల సిస్టమ్‌పై అధిక ఒత్తిడి వస్తోందని తెలిపింది. దీంతో PSP బ్యాంకులు, యాప్‌లు API వాడకాన్ని తగ్గించాలని సూచించింది. అలాగే మరో సర్క్యులర్‌లో.. బ్యాంకులు, యాప్‌లు తమ API వాడకాన్ని ఖచ్చితంగా మానిటర్ చేయాలని ఆదేశించింది. వినియోగదారులు గానీ, యాప్ బ్యాక్ ఎండ్ గానీ సరైన నియంత్రణ లేకుండా APIలు వాడితే పెనాల్టీలు లేదా యాక్సెస్ పరిమితి విధించే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది.
ఈ కొత్త విధానాల ద్వారా NPCI UPI వ్యవస్థను మరింత సమర్థవంతంగా, సురక్షితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. వినియోగదారులు తమ లావాదేవీలను మరింత బాధ్యతగా నిర్వహించాలని, నిర్దేశిత పరిమితుల మేరకే ఉపయోగించాల్సిందిగా సూచిస్తోంది. ఆగస్టు 1 నుంచి ఈ మార్పులు అధికారికంగా అమల్లోకి వస్తాయి. UPI వినియోగదారులు, యాప్‌లు, బ్యాంకులు అందరూ ఇవి గమనించి స్పందించాల్సిన అవసరం ఉంది.