Leading News Portal in Telugu

Vivo V60 5G Launch Confirmed for August 12.. Stylish Design with Zeiss Camera and Gemini AI Features


Vivo V60 5G: స్టైలిష్ లుక్, మాస్ ఫీచర్లతో మార్కెట్లో హల్చల్ చేయడానికి మూహూర్తం ఫిక్స్ చేసిన వివో V60..!

Vivo V60 5G: వివో కంపెనీ త్వరలో విడుదల చేయబోయే మిడ్-ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన Vivo V60 5G భారత మార్కెట్లో ఆగస్టు 12న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుందని అధికారికంగా వెల్లడించింది. దీనితోపాటు డిజైన్, రంగులు, కీలక ఫీచర్లను ముందుగానే ప్రకటించింది. ఈ ఫోన్ ఫిబ్రవరిలో వచ్చిన Vivo V50కి అప్డేటెడ్ గా మార్కెట్లోకి రానుంది.

Vivo V60 5G క్వాడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లేతో వస్తోంది. ఇది ఆస్పిసియస్ గోల్డ్, మిస్ట్ గ్రే, మూన్లిట్ బ్లూ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. డిజైన్ చూస్తే, ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుందని తెలుస్తోంది. ఇక వివో వెల్లడించిన వివరాల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ Snapdragon 7 Gen 4 SoC ప్రాసెసర్‌తో పని చేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 6,500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీంట్లో 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.

ZIM vs NZ: పసికూనపై ప్రతాపం చూపించిన న్యూజిలాండ్.. భారీ తేడాతో విజయం!

Image (9)

Vivo V60 5G ఫోన్ Android 15 ఆధారిత FuntouchOS 15తో ప్రీలొడెడ్‌గా లభిస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు వంటివి కూడా ఉండనున్నాయి. Vivo V60 5G ప్రధానంగా Zeiss ట్యూన్డ్ 50MP టెలిఫోటో కెమెరా (10x జూమ్ సామర్థ్యం) తో వస్తోంది. ఇందులో మల్టీఫోకల్ పోర్ట్రెయిట్ మోడ్‌లు, 8MP అల్ట్రావైడ్ కెమెరా, ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉంటాయని తెలుస్తోంది.

Vijay Sethupathi Sir Madam Review: విజయ్ సేతుపతి సార్ – మేడమ్ రివ్యూ!

Image (10)

లీకుల ప్రకారం, ఈ ఫోన్ 6.67-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో వస్తుంది. ఈ ఫోన్‌లో గూగుల్ జెమినీ AI ఫీచర్లు ఉంటాయి. అందులో Gemini Live, AI Captions, AI Smart Call Assistant లాంటి టూల్స్ ఉంటాయని వివో తెలిపింది. అంతేకాకుండా IP68, IP69 రేటింగ్ ద్వారా డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంటుంది.

Image (8) (1)