Infinix GT 30 5G+ Launching on August 8, Mid-Range Gaming Phone with Triggers, 144Hz AMOLED Display, and Dimensity 7400

హాంగ్ కాంగ్ దేశ మొబైల్ తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ తమ కొత్త స్మార్ట్‌ఫోన్ Infinix GT 30 5G+ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న GT 30 Pro తర్వాత ఈ ఫోన్ GT సిరీస్ లోని తర్వాతి మోడల్ గా తీసుక వచ్చింది. ఈ మొబైల్ ను ముఖ్యంగా గేమింగ్ ప్రియుల్ని లక్ష్యంగా చేసుకొని రూపొందించిన ఈ ఫోన్‌లో అనేక స్పెషల్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ గేమింగ్-సెంట్రిక్ డిజైన్‌తో, హై-ఎండ్ ఫీచర్లతో, యూత్ సెగ్మెంట్‌ను ఆకట్టుకునేలా ఉంది. మరిన్ని వివరాలకు ఆగస్టు 8 వరకూ వేచిచూడాల్సిందే. ఇక లీకైన వివరాల మేరకు ఫీచర్లు ఇలా ఉండనున్నాయి.
ఈ ఫోన్‌లో కస్టమైజబుల్ లైట్స్, డెడికేటెడ్ గేమింగ్ ట్రిగర్స్ కలిగి ఉంటుంది. గేమింగ్ ట్రిగర్స్‌ను తీసుకువచ్చిన తొలి మిడ్-రేంజ్ ఫోన్ ఇదే కావడం విశేషం. గేమింగ్ సమయంలో మరింత అనుభూతిని అందించడానికే ఈ ఫీచర్ ఉంది. ఇక ఈ Infinix GT 30 5G+ లో MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది 5G సామర్థ్యం కలిగిన శక్తివంతమైన చిప్‌సెట్. ఈ మొబైల్ లో 8GB వరకు LPDDR5X ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.
Ather 450S: ఏథర్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్ తో 161KM రేంజ్
కొత్తగా రాబోయే ఈ ఫోన్‌లో BGMI వంటి గేమ్స్‌ను 90fps వద్ద ఆడే అవకాశం ఉంది. అలాగే Infinix AI, Xboost AI ఫీచర్లు గేమింగ్ అనుభూతిని మరింత మెరుగుపరుస్తాయి. ఇక ఇందులో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే (1224×2720 pixels) ఉండబోతున్నట్లు సమాచారం. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటుంది. వీటితో పాటు వీడియోలు, గేమింగ్, బ్రౌజింగ్ సమయంలో అత్యుత్తమ విజువల్ అనుభవం అందించనుంది.
Infinix GT 30 5G+ మొబైల్ పల్స్ గ్రీన్, సైబర్ బ్లూ, బ్లేడ్ వైట్ అనే మూడు కలర్స్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్, ఇన్‌ఫినిక్స్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.ఈ గేమింగ్-ఫోకస్ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 8న అధికారికంగా విడుదల కానుంది. దీని గురించి పూర్తి వివరాలు ఆ రోజు వెల్లడికానున్నాయి.
Shilpa Ravi: జగన్‌ను జైలుకు పంపేందుకు కుట్ర.. కూటమి ప్రభుత్వంపై శిల్పా రవి ఆగ్రహం