Leading News Portal in Telugu

AI Impact by 2030: Over 180 Million Jobs at Risk in India, Warns Shocking Report


AI Impact: షాకింగ్ రిపోర్ట్.. ఆ దెబ్బతో 2030 నాటికి లక్షల ఉద్యోగాలు గల్లంతు!

AI Impact: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోజురోజుకీ ఎంత అబివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాలిసిన పనిలేదు. ఇకపోతే, అనేక రంగాలలో పని శైలిలో ఎంత విప్లవాత్మక మార్పులకు దారితీస్తోందో ప్రతిరోజు చాలానే చూస్తున్నాము. అయితే, ఈ సాంకేతిక విప్లవం భారత్‌లో లక్షల మంది ఉద్యోగాలకు ముప్పుగా మారబోతున్నట్టు తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా తయారీ, రిటైల్, విద్య రంగాల్లో భారీగా ఉద్యోగ నష్టాలు చోటుచేసుకోనున్నాయని ‘సర్వీస్‌నౌ’ అనే సంస్థ తాజా నివేదికలో పేర్కొంది.

ఈ నివేదిక ప్రకారం, 2030 నాటికి దాదాపు లక్ష ఎనభై కోట్ల ఉద్యోగాలు AI వల్ల నష్టపోయే అవకాశం ఉందని అంచనా. ముఖ్యంగా తయారీ రంగంలో సుమారుగా 80 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలోకి వెళ్లే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అలాగే రిటైల్ రంగంలో 76 లక్షల ఉద్యోగాలు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తేలింది. ఇక విద్యా రంగంలో కూడా ఏకంగా 25 లక్షల వరకు ఉద్యోగాలు AI ప్రభావంతో తగ్గిపోయే అవకాశముందని నివేదిక హెచ్చరించింది.

Ather 450S: ఏథర్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్ తో 161KM రేంజ్

మరోవైపు వినియోగదారులకు ప్రత్యక్ష సేవలందించే నిర్వాహకులు, పేరోల్ క్లర్క్స్ వంటి ఉద్యోగాలపై AI ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఎందుకంటే ఇవి ఆటోమేషన్‌కు అత్యధికంగా లోనయ్యే క్యాటగిరీలో ముందు వరుసలో ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సిస్టమ్ అడ్మిన్‌లు, కన్సల్టెంట్లు వంటి హై-స్కిల్ ఉద్యోగాలు AI సహకారంతో కొత్తదారులను సృష్టించనున్నాయి. ఇక ఈ వివరాలను సర్వీస్‌నౌ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుమీత్ మాథుర్ వెల్లడించిన ప్రకారం.. AI వృద్ధితో 1.35 కోట్ల ఉద్యోగాల పాత్రలు పూర్తిగా మారిపోతాయి. అలాగే, 30 లక్షల కొత్త టెక్ ఉద్యోగాలు ఏర్పడతాయన్న ఆశాభావం కూడా ఉందని ఆయన అన్నారు.

Shilpa Ravi: జగన్‌ను జైలుకు పంపేందుకు కుట్ర.. కూటమి ప్రభుత్వంపై శిల్పా రవి ఆగ్రహం

ఇది ఇలా ఉండగా, AI పట్ల స్వీకరణను లెక్కించేందుకు నిర్వహించిన సర్వేలో 500 మందికిపైగా ఇండస్ట్రీ లీడర్లు పాల్గొన్నారు. ఈ సర్వేలో సగటున సంస్థలు తమ టెక్ బడ్జెట్‌లో 13.5 శాతం ఖర్చులను AI కోసం కేటాయిస్తున్నట్లు వెల్లడైంది. అలాగే నాలుగో వంతు సంస్థలు ఇప్పటికే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ దశలో ఉన్నాయి. అయితే, ఈ మార్పులకు అడ్డుగోడగా డేటా భద్రత కనిపిస్తోందని నివేదిక స్పష్టం చేసింది. ఇంకా సుమారు 30% సంస్థలు డేటా సెక్యూరిటీపై ఆందోళన వ్యక్తం చేశాయి. అలాగే 26% కంపెనీలు భవిష్యత్తులో అవసరమయ్యే నైపుణ్యాలపై స్పష్టత లేదని అభిప్రాయపడినట్లు తెలిపింది.