
Instagram – Go Live: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు షాకింగ్ నిబంధన పెట్టింది. ఇకపై 1,000 ఫాలోవర్లు లేకపోతే లైవ్ బ్రాడ్‌కాస్ట్ చేయలేరు. అంతేకాకుండా సదరు అకౌంట్ పబ్లిక్‌గా ఉండాలి. ఈ మార్పుతో చిన్న క్రియేటర్లు, కొత్త యూజర్లకు రియల్ టైమ్‌లో తమ ఫాలోవర్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం అసాధ్యమవుతుంది. ఫేమస్ ఇన్‌ఫ్లూయెన్సర్లు లేదా పెద్ద స్థాయి కంటెంట్ క్రియేటర్లు మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకోగలుగుతారు.
Shubman Gill: ఇదే సరైన సమయం.. వన్డేలకు కెప్టెన్ గా గిల్.. క్రికెట్ దిగ్గజం ఏమన్నాడంటే?
ఈ కొత్త నిబంధనపై కంపెనీ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే ఓ నివేదిక ప్రకారం, ఈ పరిమితి ప్రస్తుతం భారత్‌లో అమలులో ఉందని తెలిసింది. ఈ మార్పు ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులందరిపై వర్తిస్తుంది. యూజర్ల సేఫ్టీ కోణంలో తీసుకున్న నిర్ణయమా..? లేక ఇతర కారణాలివేనా..? అనే విషయం కంపెనీ వెల్లడించలేదు. ఇంతకుముందే టీన్ యూజర్లకు లైవ్ ఫీచర్‌ను డిఫాల్ట్‌గా చేసిన ఇన్‌స్టాగ్రామ్, ఇప్పుడు అందరికీ ఆడ్డుకట్ట వేసినట్టుగా కనపడుతోంది.
Indian Navy Recruitment 2025: 10th, ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో జాబ్స్.. మంచి జీతం
ఈ 1,000 ఫాలోవర్ల నిబంధనను తీసుకురావడంపై విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వయస్సు 16 ఏళ్లు దాటిన టీనేజ్ యూజర్లు మాత్రం లైవ్ ఫీచర్‌ను ఎన్‌బుల్ చేసుకోవచ్చు. ఈ ఆంక్షలు చిన్న వ్యాపారాలు, ఆరంభ దశలో ఉన్న కంటెంట్ క్రియేటర్లకు నెగటివ్‌గా ప్రభావం చూపే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. రోజూ లైవ్ ద్వారా తమ ఫాలోవర్స్‌తో కనెక్ట్ అవుతూ, బేస్ పెంచుకుంటున్న చిన్న ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇక తాత్కాలికంగా ఆ సదుపాయాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంది. కొన్ని సంస్థలకైతే తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు ఇదే మాధ్యమంగా మారింది. కానీ, ఈ కొత్త నిబంధన వల్ల వారు తలెత్తే సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది.