Leading News Portal in Telugu

Google Pixel 10 Pro Design Leaked Ahead of Launch: New Colors, Updated Look, Full Reveal on August 20


Google Pixel 10 Pro: కొత్త వేరియంట్లు, మారిన లుక్స్.. లీకైన గూగుల్ పిక్సెల్ 10 ప్రో వివరాలు!

Google Pixel 10 Pro: గూగుల్ ప్రియులకు మళ్లీ అతి త్వరలో టెక్ హంగామా రాబోతుంది. ఆగష్టు 20న జరగబోయే “Made by Google” ఈవెంట్‌లో టెక్ దిగ్గజం తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లైన Pixel 10 సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేయనుంది. ఈ నేపథ్యంలో పిక్సెల్ 10 ప్రో మోడల్‌కు సంబంధించిన పూర్తి డిజైన్ రెండర్లు ముందుగానే లీక్ అవ్వడంతో, ఈ ఫోన్ ఎలా ఉండబోతుందో స్పష్టత వస్తోంది. మరి ఆ విశేషాలేంటో ఒకసారి చూద్దామా..

Mohammed Siraj: ఆ అపోహను సిరాజ్ తొలగించాడు.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రముఖ లీక్‌స్టర్ ‘ఆన్ లీక్స్’ సహకారంతో ఆండ్రాయిడ్ హెడ్లైన్స్ వెలువరించిన ఈ రెండర్లు Pixel 10 Pro ఫోన్‌ను అన్ని వైపుల నుండి చూపించాయి. దీని వెనుక భాగం గత ఏడాది వచ్చిన Pixel 9 Pro తరహాలోనే ఉండగా, పిల్‌షేప్‌ వర్షికల్ కెమెరా విభాగంలో మూడు రియర్ కెమెరాలు ఉన్నాయి. ఇందులో LED ఫ్లాష్ కూడా ఉంది. “G” లోగో క్రోమ్ ఫినిష్‌తో ఉండగా, మిగిలిన బ్యాక్ ప్యానెల్ మాట్ టెక్స్చర్‌తో కనిపిస్తోంది. గూగుల్ ఇప్పటికే ఈ డిజైన్‌ను “Obsidian” కలర్ వేరియంట్‌లో తన సోషల్ మీడియాలో టీజర్ ద్వారా చూపించడంతో, ఈ లీక్ మరింత బలంగా నిలిచింది.

ఫోన్ ఫ్రేమ్ గ్లోస్సీ ఫినిష్‌తో ఉంటుందని, కాస్త గుండ్రని కార్నర్లు ఉండబోతున్నాయని తెలుస్తోంది. పవర్ బటన్, వాల్యూమ్ బటన్‌లు రైట్ సైడ్‌లో ఉంటాయి. ఎడమ వైపు పూర్తిగా క్లీన్‌గా ఉంచారు. టాప్, బాటమ్ వైపులా యాంటెన్నా బ్యాండ్లు కలిపి స్టైలిష్ ఫినిష్ అందించబోతున్నారు. ఇంతవరకు స్పెసిఫికేషన్లలో స్క్రీన్ పరిమాణం ప్రకటించకపోయినా, ఫ్రంట్ లుక్ మాత్రం ఆకట్టుకుంటోంది. బెజెల్స్ చాలా మినిమల్‌గా ఉండగా, టాప్ సెంటర్‌లో చిన్న హోల్-పంచ్ కట్‌ఔట్ ద్వారా సెల్ఫీ కెమెరాను ప్లేస్ చేశారు.

US Bans Sports Visas: ట్రంప్ పాలనలో నయా పాలసీ.. వారికి స్పోర్ట్స్ వీసాలపై నిషేధం!

ఇప్పటి వరకు ఒబిసిడియన్ కలర్ వేరియంట్ మాత్రమే లీక్ అయినా, గూగుల్ నాలుగు వేరియంట్లలో ఈ ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ మొబైల్ ఒబిసిడియన్, పోర్సలీన్, మూన్ స్టోన్, జాడే వంటి కలర్స్ లో విడుదల కానున్నట్లు సమాచారం . వీటిలో మూన్ స్టోన్, జాడే కొత్తగా పరిచయం కానున్న కలర్లు. గత సంవత్సరం ఉన్న హాజెల్, రోజ్ ఖ్వరిట్జ్ కలర్లకు బదులుగా ఈ కలర్లు తీసుకొచ్చారు. ఇక కెమెరా, చిప్‌సెట్, ఫీచర్లు ఏవీ, ప్రైసింగ్ ఏంటన్న విష్యాలో త్వరలో తేలనున్నాయి.