Honor Play 70 Plus Launched with 7000mAh Battery, Snapdragon 6s Gen 3, and 12GB RAM Starting at Rs 17000
- 6.77 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌రేట్
- 7,000mAh భారీ బ్యాటరీ, ఇది 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
- 50MP ప్రైమరీ కెమెరా (f/1.8 అప్రెచర్‌తో), 5MP సెల్ఫీ కెమెరా (f/2.2 అప్రెచర్).
- IP65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్.

Honor Play 70 Plus: టెక్ దిగ్గజ కంపెనీలలో ఒక్కటైనా హానర్ తన తాజా మిడ్-రేంజ్ ఫోన్ Honor Play 70 Plusను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. బడ్జెట్ ధరలో, భారీ బ్యాటరీ, మంచి ప్రాసెసర్, స్టైలిష్ డిజైన్‌తో ఈ ఫోన్ మార్కెట్‌లో హల్చల్ చేయనుంది. ముఖ్యంగా దీని 7,000mAh Li-ion బ్యాటరీ 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వినియోగదారులను మరింత ఆకర్షించేలా ఉంది. మరి ఈ కొత్త మొబైల్ ఫీచర్లను పూర్తిగా తెలుసుకుందామా..
డిస్‌ప్లే అండ్ డిజైన్:
ఈ కొత్త హానర్ ప్లే 70 ప్లస్ లో 6.77 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే (720×1610 పిక్సల్స్) ఉంది. ఇది 120Hz రిఫ్రెష్‌రేట్, 700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, అలుమినోసిలికేట్ గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంది. అలాగే డిజైన్ పరంగా కూడా చాలా స్టైలిష్ గా కనపడుతుంది. ఈ ఫోన్ జాడే డ్రాగన్ స్నో, ఫాంటమ్ నైట్ బ్లాక్, క్విక్సాండ్ పింక్, జియాషాంకింగ్ అనే నాలుగు ఆకర్షణీయమైన కలర్లలో లభ్యమవుతుంది:
Jharkhand: శిబు సోరెన్‌కు నివాళులర్పిస్తూ ఎక్కి ఎక్కి ఏడ్చిన చంపై సోరెన్
ప్రాసెసర్ అండ్ స్టోరేజ్:
ఈ ఫోన్‌లో Snapdragon 6s Gen 3 చిప్‌సెట్ తో పాటు Adreno A619 GPU కూడా అందించారు. గేమింగ్ కోసం ఇది మంచి కాంబో కానుంది. ఈ మొబైల్ 12GB ర్యామ్ తో, 256GB లేదా 512GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 12GB ర్యామ్ సాఫీగా మల్టీటాస్కింగ్ చేసుకోవచ్చు.
కెమెరా:
హానర్ ప్లే 70 ప్లస్ లో ఫోటోగ్రఫీకి ఈ ఫోన్ వెనుక భాగంలో ఒకే ఒక్క 50MP ప్రైమరీ కెమెరా (f/1.8 అప్రెచర్‌తో) లభిస్తుంది. అయితే ముందు భాగంలో కేవలం 5MP సెల్ఫీ కెమెరా (f/2.2 అప్రెచర్) మాత్రమే ఉంది. కెమెరా సిస్టమ్‌లో AI ఎలిమినేట్, AI ఎక్సపాండ్ ఇమేజ్ వంటి మంచి ఫీచర్లు ఉన్నాయి. సెల్ఫీ కెమెరా ఫేస్ రికగ్నిషన్ కూడా సపోర్ట్ చేస్తుంది.
బ్యాటరీ:
హానర్ ప్లే 70 ప్లస్ లో ఏదైనా గట్టిగా చెప్పే విషయం ఏదైనా ఉంది అంటే అది బ్యాటరీనే. ఈ ఫోన్ లో 7,000mAh భారీ బ్యాటరీ, ఇది 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కంపెనీ ప్రకారం మొబైల్ ను ఒకసారి ఛార్జ్ చేస్తే 23 గంటల వీడియో ప్లేబ్యాక్ అందుతుంది. 12 గంటల వీడియో కాలింగ్ కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, బ్యాటరీ 60 నెలలు (5 సంవత్సరాలు) వరకూ పనిచేస్తుందని హానర్ పేర్కొంది.
Vivo Y04s Launch: బడ్జెట్ సెగ్మెంట్‌లో 6,000mAh బ్యాటరీ, 6.74 అంగుళాల భారీ డిస్‌ప్లేతో విడుదలైన వివో Y04s.. ఫీచర్లు ఇలా!
ఇక ఈ కొత్త మొబైల్ లో ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో IP65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, గోల్డ్ లేబుల్ 5-స్టార్ డ్రాప్ సర్టిఫికేషన్, Ambient లైట్ సెన్సార్, యాక్సిలెరోమీటర్, కంపాస్, Proximity సెన్సార్, ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ Histen 7.3 సౌండ్, USB Type-C, NFC, Bluetooth 5.1, Dual-band Wi-Fi, OTG, GPS, AGPS, Beidou, Glonass, Galileoలు లభిస్తున్నాయి. ఈ మొబైల్ బరువు 207 గ్రాములు కాగా, 8.24mm మందం ఉంది.
ధర:
Honor Play 70 Plus ఫోన్‌ను చైనాలో రెండు వేరియంట్లలో విడుదల చేశారు. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,399గా ఉండగా, ఇది సుమారుగా భారత కరెన్సీలో రూ.17,000కు సమానం. ఇక 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,599, అంటే సుమారు రూ.19,000.చైనా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ డివైస్, త్వరలోనే ఇతర మార్కెట్లలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.