Leading News Portal in Telugu

Vivo Y04s Launched with 6,000mAh Battery and 6.74 inches Display at Just 7480


  • Vivo Y04s‌ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్
  • 6,000mAh భారీ బ్యాటరీ
  • వెనుక భాగంలో 13MP ప్రధాన కెమెరా + QVGA సెకండరీ లెన్స్ తో డ్యూయల్ కెమెరా సెటప్
  • Unisoc T612 Octa-Core చిప్‌సెట్.
Vivo Y04s Launch: బడ్జెట్ సెగ్మెంట్‌లో 6,000mAh బ్యాటరీ, 6.74 అంగుళాల భారీ డిస్‌ప్లేతో విడుదలైన వివో Y04s.. ఫీచర్లు ఇలా!

Vivo Y04s Launch: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo), తాజాగా తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Vivo Y04s‌ను ఇండోనేషియాలో లాంచ్ చేసింది. ఫీచర్ల పరంగా మంచి పనితీరుతో వస్తున్న ఈ ఫోన్ ధర మాత్రం ఆశ్చర్యం కలిగించే స్థాయిలో చాలా తక్కువగా ఉంది. పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 14, స్టైలిష్ డిజైన్ వంటి అంశాలు బడ్జెట్ వినియోగదారులకు ఆకర్షణీయంగా ఉన్నాయి. మరి ఈ కొత్త Vivo Y04s పూర్తి ఫీచర్లపై ఓ లుక్ వేద్దామా..

డిస్‌ప్లే అండ్ డిజైన్:
Vivo Y04s 6.74 అంగుళాల LCD టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది HD+ (1600×720 pixels) రిజల్యూషన్, 60Hz నుంచి 90Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్‌రేట్, 570 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. 260ppi పిక్సెల్ డెన్సిటీతో పాటు 70% NTSC కలర్ గామట్‌తో కలర్ సాచురేషన్ మంచి స్థాయిలో ఉంటుంది. వెనుక భాగంలో క్రిస్టల్ లైన్ మాట్టే డిజైన్ ఫినిష్ ఉంది.

Google Pixel 10 Pro: కొత్త వేరియంట్లు, మారిన లుక్స్.. లీకైన గూగుల్ పిక్సెల్ 10 ప్రో వివరాలు!

Image (1)

ప్రాసెసర్ అండ్ స్టోరేజ్:
ఈ Vivo Y04s ఫోన్‌లో Unisoc T612 Octa-Core చిప్‌సెట్ ఉంది. అలాగే ఇందులో 4GB LPDDR4X ర్యామ్ ను అందించారు. అలాగే 64GB eMMC 5.1 ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందిస్తున్నారు. ఈ స్టోరేజ్ ను 1TB వరకు మైక్రో SD కార్డు ద్వారా పెంచుకోవచ్చు.

Image (2)

కెమెరా సెటప్:
కొత్తగా విడుదలైన Vivo Y04sలో వెనుక భాగంలో 13MP ప్రధాన కెమెరా + QVGA సెకండరీ లెన్స్ తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అలాగే LED ఫ్లాష్ కూడా లభిస్తుంది. ఇక మొబైల్ ఫ్రంట్‌లో 5MP సెల్ఫీ కెమెరా వాలర్‌ డ్రాప్ నాచ్‌ లో ఉంది. కెమెరాలు నైట్ మోడ్, పోర్ట్రైట్, పానోరమా, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్ మోడ్‌లకు సపోర్ట్ చేస్తాయి.

Image (3)

బ్యాటరీ:
ఈ కొత్త మొబైల్ లో 6,000mAh భారీ బ్యాటరీతో ఉంది. అయితే దీనికి కేవలం 15W ఫ్లాష్‌చార్జ్ సపోర్ట్ మాత్రమే లభిస్తుంది. ఇది Funtouch OS 14 పై రన్ అవుతుంది. ఇది Android 14 ఆధారిత వర్షన్.

US Bans Sports Visas: ట్రంప్ పాలనలో నయా పాలసీ.. వారికి స్పోర్ట్స్ వీసాలపై నిషేధం!

ఇక ఈ మొబైల్ లో ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. ఫింగర్‌ప్రింట్ స్కానర్, 4G LTE, Dual-band Wi-Fi, Bluetooth 5.2, USB Type-C పోర్ట్, GPS, Beidou, GLONASS, Galileo, యాక్సిలెరోమీటర్, Ambient లైట్ సెన్సె, Proximity సెన్సార్ వంటివి ఉన్నాయి. ఈ మొబైల్ బరువు 202 గ్రాములుగా ఉంది.

Image

ధర:
ఇండోనేషియాలో Vivo Y04s ధర IDR 13,99,000గా ఉంది. అంటే ఇది భారత రూపాయలలో సుమారుగా 7,480 అనమాట. ఈ మొబైల్ కేవలం 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ మాత్రమే లభ్యం అవుతుంది. ఈ ఫోన్‌ను క్రిస్టల్ పర్పుల్, జాడే గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయొచ్చు. Vivo అధికారిక వెబ్‌సైట్‌తో పాటు Akulaku, Shopee, BliBli, TikTok వంటి స్టోర్లలో ఈ మొబైల్ అందుబాటులో ఉంది.