
Who Invented the Screenshot Feature: ఈ రోజుల్లో అసలు ఫోన్ లేని వాళ్లంటూ ఎవరూ ఉండరు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ తెగవాడేస్తున్నారు. టెలిఫోన్ కనిపెట్టింది అలెగ్జాండర్ గ్రహంబెల్.. సెల్‌ఫోన్ కనిపెట్టింది మార్టిన్ కూపర్.. మరి స్మార్ట్‌ఫోన్‌లో స్క్రీన్‌షాట్ ఆప్షన్ తీసుకొచ్చింది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చాలా మందికి తెలియక పోవచ్చు. మీకు తెలియకపోతే ఈ స్టోరీ మీకోమే..
READ MORE: Tim Cook vs Trump: ట్రంప్ వ్యాఖ్యలను లైట్ తీసుకున్న టీమ్ కుక్.. భారత్‌తోనే దోస్తాన్!
స్క్రీన్‌షాట్ ఆప్షన్ లేని స్మార్ట్‌ఫోన్‌ను మనం ఊహించలేం. ఉన్నట్లుండి ఏమైనా ఇంపార్టెంట్ వివరాలు మిత్రులకు లేదా అధికారులకు పంపించాల్సి వచ్చినప్పుడు, మంచి కొటేషన్ కనిపిస్తే స్క్రీన్‌షాట్ తీసి వాట్సప్‌లో స్టేటస్‌గా పెట్టాలంటే నిమిషాల్లో స్క్రీన్‌షాట్ తీసి పెట్టుస్తున్నాం. ఊహించుకోండి ఒకవేళ మీ ఫోన్‌లో స్క్రీన్‌షాట్ అనే ఆప్షన్ లేకుంటే ఏం చేసేవాళ్లు. మీకు ఎప్పుడైనా ఈ ప్రశ్న వచ్చిందా? అసలు ఫోన్‌లో ఈ స్క్రీన్‌షాట్ అనే వెసులుబాటును కనిపెట్టింది ఎవరు? మన ఫోన్‌లోకి ఈ స్క్రీన్‌షాట్ ఫీచర్ వచ్చిందో తెలుసుకోవాలని అనిపించిందా? ఈ స్టోరీ చదివి మీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి..
మీకు తెలుసా!
మొదటిసారి 2008లో iPhone OS 2లో స్క్రీన్‌షాట్ ఫీచర్ అధికారికంగా వచ్చింది. అంతకుముందు వరకు అసలు స్మార్ట్‌ఫోన్లలో ఈ ఫీచర్ లేదు. అప్పుడు స్క్రీన్‌షాట్ కోసం థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించాల్సి వచ్చేది. అక్టోబర్ 2011లో విడుదలైన ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్‌విచ్ ఓఎస్‌లో అధికారికంగా స్క్రీన్‌షాట్ ఫీచర్ యాడ్ చేశారనే విషయం ఎంత మందికి తెలుసు ఫ్రెండ్స్. అప్పటి నుంచి, యూజర్లు స్క్రీన్‌షాట్ తీసుకోవడానికి పవర్ + వాల్యూమ్ డౌన్ బటన్ క్లిక్ చేస్తున్నారు. మన స్మార్ట్‌ఫోన్‌లో స్క్రీన్‌షాట్ స్టోరీ ఇది.
READ MORE: RRC ER Recruitment 2025: రైల్వేలో 3,115 జాబ్స్.. రాత పరీక్ష లేదు.. ఈజీగా జాబ్ కొట్టే ఛాన్స్
ఏ స్మార్ట్‌ఫోన్‌లోనైనా ఎక్కువగా ఉపయోగించే ఫీచర్లలో స్క్రీన్‌షాట్‌లు ఒకటి. ఈ స్క్రీన్‌షాట్‌లనే స్క్రీన్ గ్రాబ్ అని కూడా పిలుస్తారు. మీకు తెలుసా నేటి డిజిటల్ జీవితంలో, స్క్రీన్‌షాట్ తీసుకోవడం అనేది ఒక కామన్ థింక్ అయ్యిందని. స్క్రీన్‌షాట్ తీయడానికి ప్రతి ఫోన్‌లో వేర్వేరు ఆప్షన్స్ ఉంటాయి. ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో పవర్ + వాల్యూమ్ డౌన్ బటన్ ప్రెస్ చేసి స్క్రీన్‌షాట్ తీయొచ్చు. లేదా పాత ఐఫోన్‌లలో పవర్ + హోమ్ ఆప్షన్‌తో స్క్రీన్‌షాట్ తీయొచ్చు. షార్ట్‌కట్‌లో స్క్రీన్‌షాట్ తీయడానికి మూడు వేళ్లు ఉపయోగిస్తారు. దీన్ని 3 ఫింగర్ జెస్చర్ అంటారు. ఇవి కాకుండా హోమ్ స్క్రీన్‌లో కిందకు స్వాప్ చేస్తే విడ్జెట్ ప్యానెల్‌ల కూడా స్క్రీన్‌షాట్ కోసం షార్ట్‌కట్ ఉంటుంది.